పల్నాడు జిల్లా, అమరావతిలో కృష్ణానది ఒడ్డున, ధ్యాన బుద్ధ ప్రాంగణంలో యోగాంధ్ర కార్యక్రమం విజయవంతంగా జరిగింది.. వేలాదిమంది యోగా సాధకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.. కార్యక్రమంలో పలనాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు గారు, రాష్ట్ర ఎంపీపీల సంఘం అధ్యక్షులు అమరావతి ఎంపీపీ మేకల హనుమంతరావు గారు, DRDA PD గారు, DWAMA PD గారు, DEO గారు, RDO గారు , DPO గారు, DLPO గారు, పర్యాటక శాఖ అధికారులు, మండల తహసిల్దార్ డానియల్ గారు, ఎంపీడీవో పార్వతి గారు, పలువురు జిల్లా మరియు మండల స్థాయి అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, వెలుగు సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, మెడికల్ సిబ్బంది, విద్యార్థులు మరియు పలువురు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.. ఎంపీపీ హనుమంతరావు గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో యోగాను అంతర్భాగం చేసుకుని ఆరోగ్యవంతమైన జీవనాన్ని కొనసాగించాలన్నదే నరేంద్ర మోడీ గారి లక్ష్యమని తెలిపారు.. యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఘనత శ్రీ నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని కొనియాడారు.. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ప్రత్యేక చొరవ తీసుకుని యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం అయ్యేలా కార్యాచరణ రూపొందించారని కొనియాడారు..
Trending
- సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి తరుపున టిడ్కో గృహాల సముదాయంలో ఆలయ నిర్మాణనానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు.
- నియోజకవర్గ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : ప్రత్తిపాటి
- మున్సిపల్ ఎన్నికల వేళ చిలకలూరిపేటలో పోలీసుల భారీ సాయుధ కవాతు
- ప్రధాని నరేంద్ర మోది జన్మదిన సందర్భంగా ‘సేవా సంకల్ప’ కార్యక్రమం లొ పాల్గొన్న మల్లెల శివ నాగేశ్వరావు
- పల్నాడు జిల్లా జనతా వారది కార్యక్రమం నరసరావుపేట జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది
- మోదీ నాయకత్వంలో సరికొత్త అభివృద్ధి సంక్షేమంతో భారత కీర్తి విశ్వవ్యాప్తమైంది : ప్రత్తిపాటి
- చిలకలూరిపేటలో బహిరంగంగా మద్యం సేవించిన 14 మందికి రూ.14 వేల జరిమానా
- ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో సరిచూసుకోండి: రేపటి నుండి BLOల ఇంటింటి పర్యటన!



