పోగొట్టుకున్న 11 సెల్ ఫోన్‌ల రికవరీ, బాధితులకు అందించిన : అర్బన్ సిఐ రమేష్

చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో పోగొట్టుకున్న 11 సెల్ ఫోన్‌లను పేట అర్బన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది విజయవంతంగా రికవరీ చేశారు. ఈరోజు, పేట అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పి. రమేష్ రికవరీ చేయబడిన ఈ సెల్ ఫోన్‌లను వాటిని పోగొట్టుకున్న బాధితులకు అప్పగించారు.ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ రమేష్ మాట్లాడుతూ, సెల్ ఫోన్‌లు పోగొట్టుకున్న వెంటనే బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం వల్ల వాటిని తిరిగి పొందడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. సైబర్ క్రైమ్ మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ ఫోన్‌లను గుర్తించడం జరిగిందని, ప్రజలు తమ వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.పోగొట్టుకున్న తమ సెల్ ఫోన్‌లను తిరిగి పొందిన బాధితులు పోలీస్ అధికారులకు, ముఖ్యంగా ఇన్‌స్పెక్టర్ రమేష్ కి మరియు వారి బృందానికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు.

Share.
Leave A Reply