పేద కుటుంబాల్లో వెలుగులు నింపాలన్నదే రోటరీ క్లబ్ ముఖ్య ఉద్దేశమని రోటరీ క్లబ్ ప్రతినిధులు తెలిపారు.

చిలకలూరిపేట పట్టణంలో బుధవారం చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

చేయూత చక్రాలు అనే నినాదంతో రోటరీ క్లబ్ చిలకలూరిపేట, రోటరీ క్లబ్ పండరీ పురం… అద్ధంకి తదితర క్లబ్ ల ప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాలు జరిగాయి.

ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు జాస్తి రంగారావు, వెంకటేశ్వరరావు, లంక ఆదినారాయణ, వారణాసి శరత్ కుమార్,లతో పలువురు సభ్యులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply