చిలకలూరిపేట భాష్యం స్కూల్ లో ఘనంగా ముందస్తు యోగ దినోత్సవం
వివిధ రకాల ఆసనాలు వేసిన చిన్నారులు
రాష్ట్ర వ్యాప్తంగా యోగ ను ఒక ఉత్సవంలా నిర్వహిస్తున్న భాష్యం విద్యా సంస్థలు
అవగాహన కల్పించిన ZEO హృదయ రాజ్, ZCO ప్రమీల రాణి,ప్రిన్సిపాల్ సునీల్
మూడు రోజుల పాటు పాటశాల లో జరగనున్న యోగ ప్రక్రియ
యోగా చేయడం వల్ల విద్యార్థులలో మానసిక ఉల్లాసం,ప్రశాంతత ,లభిస్తుందని చిలకలూరిపేట భాష్యం స్కూల్ ప్రిన్సిపాల్ నరసరావుపేట భాష్యం స్కూల్స్ జోన్ ZCO అంచా ప్రమీల రాణి తెలిపారు.
గురువారం ఉదయం చిలకలూరిపేట భాష్యం స్కూల్ ఆధ్వర్యంలో భాష్యం గ్రౌండ్ నందు విద్యార్థులు, చిన్నారులు యోగ చేశారు.
ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా ముందస్తు గా భాష్యం స్కూల్ విద్యార్థులు యోగ చేసి యోగ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి వివరించారు.
ఈ సందర్భంగా ZEO హృదయ రాజ్ ,ZCO అంచా ప్రమీల రాణి ,ప్రిన్సిపాల్ సునీల్ మాట్లాడుతూ ప్రతి రోజు ఉదయాన్నే యోగ చేయడం ఆరోగ్యానికి మేలు జరుగుతుందని, శరీర దృఢత్వం, మానసిక పునరుత్తేజానికి, ప్రశాంత తకు యోగ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
పాఠశాల వ్యాయమ ఉపాద్యాయులు చిన్నారులచే యోగ చేయించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సునీల్, ZEO హృదయ రాజ్ తదితరులు పాల్గొన్నారు