పల్నాడు జిల్లా, చిలకలూరిపేట నియోజకవర్గ స్థాయిలో, చిలకలూరిపేట పట్టణంలోని రైతు బజార్ వెనుక గల కాంప్లెక్స్ నందు రెండు తెలుగు రాష్ట్రాల రాధా రంగా మిత్రమండలి వ్యవస్థాపక అధ్యక్షులు చెలికొండ ధర్మారావు అలియాస్ బుల్లెట్ ధర్మారావు ఆదేశాల ప్రకారం నేడు పట్టణంలో రాధా రంగా మిత్రమండలి నూతన కార్యాలయం చిలకలూరిపేట నియోజకవర్గ రాధా రంగా మిత్రమండలి కన్వీనర్ అచ్చుకోల మురళీకృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర బీసీ నాయకులు కస్తూరి వెంకటేశ్వర్లు కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అచ్చు కోల మురళీకృష్ణ మాట్లాడుతూ ..బడుగు బలహీన వర్గాల వారి కోసం వారి అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించి ఎన్నో త్యాగాలను ,మరెన్నో ఉద్యమాలను చేపట్టినటువంటి రాధా రంగ ప్రజల హృదయాల్లో నిలిచిపోయే నాయకులన్నారు. ఆయన అడుగుజాడల్లోనే ఈ మిత్ర మండలి కార్యాచరణను రాబోయే కాలంలో ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా పేద విద్యార్థులకు, నిరుపేదలకు కుల…
Author: chilakaluripetalocalnews@gmail.com
నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సంకల్ప రూపం.. కొండమోడు – పేరేచర్ల జాతీయ రహదారి నిర్మాణం సాకారమవుతున్న తరుణం అత్యంత ముఖ్యమైన రహదారి, నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారి సంకల్పం, కృషికి ప్రతి రూపం.. కొండమోడు – పేరేచర్ల జాతీయ రహదారి నిర్మాణం నేడు జరగబోతోంది. ఇప్పటికే అన్ని అనుమతులు, నిధులు మంజూరయ్యి.. భూమి పూజ కార్యక్రమం జరగనుంది. ..49.92 కి. మీ మేర నాలుగు వరుసలుగా అభివృద్ధి కోసం రూ. 881.61 కోట్లతో భూమి పూజ జరగనుంది. ప్రధాన నగరాలకు ప్రధాన రహదారులకు కనెక్టివిటీగా ఉండి, అభివృద్ధికి నోచుకోక, ప్రమాదాలకి నెలవుగా ఇబ్బందికరంగా ఉన్న ఈ రహదారిని.. జాతీయ రహదారిగా విస్తరించేందుకు మొదటినుంచి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అలుపెరగని కృషి చేశారు. దీంతో కేంద్రం దీన్ని జాతీయ రహదారిగా గుర్తించింది. తర్వాత విడతల వారీగా నిధులను విడుదల చేస్తూ, భూసేకరణ ప్రక్రియను కూడా పూర్తి చేసింది, కాంట్రాక్టర్లు ఎంపిక చేసి టెండర్లు…
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం రెంటచింతల గ్రామంలోని ఎంపీడీవో ఆఫీసు నుండి బస్టాండ్ వరకు తిరంగా ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది పహాల్గం దాడికి నిరసనగా భారత సైనికుల శౌర్య పరాక్రమానికి నిదర్శనంగా మన భారత జాతి ఐక్యతను చాటుతూ పాకిస్తాన్ ఉగ్రములకు మన దేశ సైనిక దళాల శక్తిని నిరూపించిన మన ప్రియతమ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురందేశ్వరి గారి ఆదేశాల మేరకు రెంటచింతల మండల బిజెపి అధ్యక్షులు బోయ నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి మాచర్ల నియోజకవర్గ నాయకులు పోకూరి కాశీపతి పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం దేశ రక్షణకు పెద్ద పీట వేస్తుందని యుద్ధంలో చనిపోయిన భారత సైనికులకు ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాశం మట్టారెడ్డి, అనంతవరపు గోపి, సురేష్ కుమార్…
కళా పరిషత్,CR క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన నాటిక పోటిలు ముగింపు చివరి రోజు ముగింపు వేడుకల్లో పాల్గొన్న శాసన సభ్యులు ప్రత్తిపాటి నాటిక పోటిల్లో గెలుపొయిందిన విజేత లకు నగదు, మెమంటో బహుమతులు అందించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి ప్రత్తిపాటి కి ఘన స్వాగతం పలికిన CR క్లబ్ పాలక వర్గం అంతరించి పోతున్న రంగస్థల నాటికలను ప్రోత్సహిస్తున్న CR క్లబ్ పాలక వర్గాన్ని, చిలకలూరిపేట కళా పరిషత్ ను అభినందించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి ముగింపు నాటికల్లో విశేషా సేవలందించిన కళా పరిషత్ సభ్యులు ను ఎమ్మెల్యే అభినందించారు
చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామ వాస్తవ్యులు తేలప్రోలు శాంతారావు గారి కుమార్తె వివాహం వారి స్వగృహం నందు జరుగుచుండగా ఆ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు వెంకట లక్ష్మి -సాయి తేజ లను ఆశీర్వదించి , శుభాకాంక్షలు తెలియజేసిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు… ఈ వేడుకలో వారి వెంట గుత్తా నరసింహారావు గారు,గాయల నాగయ్య గారు, బొడ్డపాటి విశ్వనాథం గారు,మాలంపాటి నరసింహారావు గారు,జవ్వాజి సుబ్బారావు గారు, మాలంపాటి రామారావు గారు, గుత్తా విక్రమ్ గారు, గుత్తా రామారావు గారు, గుత్తానాగేశ్వరరావు గారు తదితరులున్నారు.
వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ గారి కార్యాలయం, నందు యుగపురుషుడు నందమూరి తారక రామారావు గారి 102వ జయంతిని నిర్వహించనున్న నాటకోత్సవాల పాంప్లెట్ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారు మరియు వారి సతీమణి శ్రీమతి గోనుగుంట్ల లీలావతి గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి గారు మాట్లాడుతూ, ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానుభావుడని, ఆయన కేవలం ఒక నటుడిగానే కాకుండా గొప్ప పరిపాలకుడిగా, ప్రజా నాయకుడిగా తెలుగు జాతికి అందించిన సేవలు అపారమని కొనియాడారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని నాటకోత్సవాలు నిర్వహించడం ఆయనకు ఘనమైన నివాళిలు ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు గారు తదితరులు పాల్గొన్నారు.
ప్రతిష్ఠాత్మకంగా రేపు వినుకొండ తెదేపా మహానాడు: చీఫ్ విప్ జీవీ కడపలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగబోతున్న తెలుగుదేశం మహానాడుకి సన్నాహకంగా సోమవారం వినుకొండలో నియోజకవర్గస్థాయి మహానాడు నిర్వహించనున్నట్లు తెలిపారు ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. వినుకొండ తిమ్మాయపాలెం రోడ్డులోని వై కన్వెన్షన్ హాలులో ఉదయం 9.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. సోమవారం జరగబోయే కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ అభివృద్ధి కోసం అందరి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు స్వీకరిస్తామని, వాటిని నివేదికగా రూపొందించి ఈ నెల 21వ తేదీలోగా పార్టీ కేంద్ర కార్యాలయానికి సమర్పిస్తామని తెలిపారు. ఆదివారం ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగబోతున్న కడప మహానాడు కార్యక్రమానికి అందరినీ సన్నద్ధం చేసే లక్ష్యంతో ఈ మహానాడు…
చిలకలూరిపేట పట్టణం, నన్నపనేని కళ్యాణ మండపం నందు కరణం పట్టాభి సీతారాం గారి కుమారుని వివాహ రిసెప్షన్ కు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు, చిలకలూరిపేట శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు, ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు తోట రాజా రమేష్ గారు, నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు గారు, చిలకలూరిపేట రూరల్ మండలం అధ్యక్షులు జువాజీ మదన్ మోహన్ గారు, ఎడ్లపాడు మండలం అధ్యక్షులు కామినేని సాయిబాబు గారు పలువురు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.
చిలకలూరిపేట నియోజకవర్గo, కనపర్రు గ్రామంలో పూదోట జయప్రద్ గారి కుమారుని వివాహ రిసెప్షన్ కు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు, చిలకలూరిపేట శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు, ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు గారు, నాదెండ్ల మండలం అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ గారు, చిలకలూరిపేట రూరల్ మండలం అధ్యక్షులు జువాజి మదన్మోహన్ గారు పలువురు గ్రామ నాయకులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.
చిలకలూరిపేట నియోజకవర్గo, గణపవరం గ్రామానికి చెందిన సరికొండ సాయి రాజు గారి కుమారుని వివాహమునకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు,చిలకలూరిపేట శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు, ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు గారు, చిలకలూరిపేట జువ్వజీ మండలం అధ్యక్షులు జువ్వాజి మదన్మోహన్ గారు, యడ్లపాడు మండలం అధ్యక్షులు కామినేని సాయిబాబు గారు గ్రామ నాయకులు విచ్చేసి ఆశీర్వదించడం జరిగింది.









