అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మహిళల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహణ
అమరావతి రాజధాని ప్రాంత మహిళల పట్ల ఇటీవల ఒక ప్రముఖ ఛానెల్ నందు కొంత మంది వ్యక్తులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తూ, ఈరోజు స్థానిక మహిళా సంఘాలు, యువజన సంఘాలు మరియు సామాజిక కార్యకర్తలు కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీ N.R.T సెంటర్ నందలి రైతు బజార్ వద్ద ప్రారంభమై, గడియారం స్తంభం వరకు కొనసాగింది.
ర్యాలీలో పాల్గొన్నవారు ప్లే కార్డులు పట్టుకొని “మహిళలపై దుర్మార్గపు వ్యాఖ్యలు తక్షణం ఆపాలి”, “సమాజం మహిళలను గౌరవించాలి” అనే నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ ,మహిళల గౌరవానికి భంగం కలిగించే ఇటువంటి వ్యాఖ్యలు క్షమార్హం కాదని,ఇటువంటి వ్యాఖ్యలను చేసేవారిని చూస్తూ,సహించేది లేదని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహిళా ప్రధాన కార్యదర్శి శ్రీమతి మిరియాల రత్నకుమారిగారుమాట్లాడుతూ, “మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేయడం కేవలం ఒక వ్యక్తిని మాత్రమే కాక, మొత్తం సమాజాన్ని తక్కువగా చూపే చర్య” అని పేర్కొన్నారు.