కిశోరిబాలికలకు క్రీడలపై అవగాహన ర్యాలీ
యడ్లపాడు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కిశోరి వికాసం వేసవి శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఈ అవగాహన ర్యాలీని ఎంపీపీ ఝాన్సీ సాగర్, ఎంపీడీవో వి. హేమలతాదేవి బెలూన్లు ఎగురవేసి ప్రారంభించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీలో వారు మాట్లాడుతూ, పిల్లలను టీవీలు, సెల్‌ఫోన్లకు దూరంగా ఉంచి శారీరక శ్రమ కలిగించే క్రీడల్లో పాల్గొనేటట్లు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. క్రీడల ద్వారా మానసిక ఒత్తిడి తగ్గి, ఆరోగ్యవంతమైన జీవనశైలి అలవడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ కార్యకర్తలు, కిశోర బాలికలు పాల్గొన్నారు.