త్యాగం, క్షమకు కట్టుబడి ప్రతి ఒక్కరూ తమలోని స్వార్థాన్ని త్యజించాలన్నదే బక్రీద్ ప్రధానోద్దేశం : మాజీమంత్రి ప్రత్తిపాటి

  • నియోజకవర్గంలోని ముస్లిం సోదర, సోదరీమణులకు హృదయపూర్వక బక్రీద్ శుభాకాంక్షలు : ప్రత్తిపాటి “పరమపవిత్రమైన ‘రంజాన్’ తర్వాత ముస్లింలకు మరో ముఖ్యమైన పండగ బక్రీద్. త్యాగానికి ప్రతీకైన బక్రీద్ పండగను ముస్లిం సోదర, సోదరీమణులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ పండుగలో భాగంగా మరణించిన తమ పూర్వీకులు, పెద్దలకు ఇష్టమైన కానుకలు సమర్పించి వారిని స్మరించుకుంటారు. మానవజీవితంలో త్యాగానికి ఉన్న విశిష్టతను చాటిచెప్పడమే బక్రీద్ పండుగ ప్రధానోద్దేశం. త్యాగం, క్షమకు కట్టుబడి ప్రతిఒక్కరూ తమలోని స్వార్థాన్ని త్యజించాలని చెప్పడమే ఈ పండుగలోని పరమార్థం. అటువంటి గొప్ప పండుగను నియోజకవర్గంలోని ముస్లింలందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. రాగద్వేషాలకు, తారతమ్యాలకు అతీతంగా ప్రతి ముస్లిం అల్లాహ్ ఆదేశాలకు బద్ధుడై జీవించాలన్నదే బక్రీద్ తెలిపే మరో గొప్ప సందేశం. బక్రీద్‌ ను ‘ఈద్ ఉల్ జుహా’ అని కూడా పిలుస్తారు. ఇస్లాంలోని ఐదు ప్రధాన సూత్రాలలో ఒకటైన హజ్‌ ‌తీర్థయాత్రను ముస్లింలు ఈ నెలలోనే ప్రారంభించడం మరో విశేషం.” అని మాజీమంత్రి ప్రత్తిపాటి ఒక ప్రకటనలో తెలిపారు
Share.
Leave A Reply