మనవళ్లే దాడి చేశారంటూ స్టేషన్లో కేసు నమోదు

యడ్లపాడు ఠానా ను ఆశ్రయించిన భాదితులు

యడ్లపాడు మండలంలోని కొండవీడు గ్రామంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది.

ఒకరికి అమ్మమ్మ, మరోకరికి నాయినమ్మ అయ్యే వృద్దురాలిపై దాడి చేశారంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కొండవీదు గ్రామానికి చెందిన తోట లక్ష్మీకాంతమ్మ తన మనవళ్లు మహేష్‌బాబు, దమ్ము రామారావులకు తరచు డబ్బులు ఇస్తుంటుంది.

ఈ విషయాన్ని వారి తల్లులకు చెప్పిందని ఆగ్రహిస్తూ ఈనె 4వ తేదీన మహేష్‌బాబు తన నాయినమ్మపై గొడవపడి జుట్టుపట్టుకుని కొట్టాడంటూ ఫిర్యాదులో ఫిర్యాదులో పేర్కొంది.

దాడి చేయగానే ఆమె కొండవీడు నుంచి చిలకలూరిపేటలో నివాసం ఉంటున్న తన కుమార్తె మాధవి వద్దకు వెళ్లింది.

అయినా ఆమెకు ఫోన్లు చేసి మనవళ్లు వేధింపులకు గురి చేయడంతో పోలీసులను ఆశ్రయించి తన గోడును విన్నవించుకుంది.

దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాSప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ టి శివరామకృష్ణ తెలిపారు.

Share.
Leave A Reply