జూన్ 8న సీనియర్ సిటిజెన్లతో యోగాంధ్ర: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు

నరసరావు పేట,జిల్లా కేంద్రం నరసరావు పేటతో పాటు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల పట్టణాలలో జూన్ 08న సీనియర్ సిటిజెన్లతో ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు తెలిపారు. వృద్ధుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు.

శుక్రవారం మధ్యాహ్న యోగాంధ్ర కార్యక్రమంపై అధికారులతో జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

జూన్ 9 సోమవారం గ్రామాలు, మండల కేంద్రాలు, మున్సిపాలిటీలలో యోగాంధ్ర ర్యాలీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, జిల్లా వ్యాప్తంగా 5,000 ప్రాంతాల్లో ఏకకాలంలో యోగా కార్యక్రమాలు నిర్వహించేందుకు స్థలాలను ఎంపిక చేసి, ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు.

Share.
Leave A Reply