పర్యావరణ పరిరక్షణ దినోత్సవ సందర్భంగా చిలకలూరిపేట బిజెపి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం
చిలకలూరిపేట పట్టణం ఆరో వార్డులో అమ్మకు ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా ఆరో వార్డ్ బూత్ అధ్యక్షురాలు ఆదిమూలం భ్రమరాంబ మరియు పట్టణ అధ్యక్షులు పవన్ కుమార్ గాంధీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గ కన్వీనర్ జయరాం రెడ్డి, కోకన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు, ఈ కార్యక్రమం ఇంచార్జ్ ఆదిమూలం గురుస్వామి, కో ఇన్ఛార్జ్ బండారు నాగరాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి సింగిరేసు పోలయ్య, బీజేవైఎం స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ పులిగుజ్జ మహేష్, మాజీ పట్టణ అధ్యక్షులు పొత్తూరి బ్రహ్మానందం, నాదెండ్ల మండల మాజీ అధ్యక్షులు ఆల శివ కోటిరెడ్డి, బిజెపి నాయకులు గట్టా హేమ,ఉప్పాల భాస్కరరావు, గణికపూడి క్రాంతి, గోపి దేశి శ్రీలక్ష్మి, ఆల శ్రీలక్ష్మి, కార్యకర్తలు మహిళా నాయకులు నాయకురాలు పాల్గొన్నారు.