చిలకలూరిపేట పట్టణంలోని, శ్రీరస్తు ఫంక్షన్ హల్ నందు జరుగుచున్న వినుకొండ ఎమ్మార్వో సభావతు సురేష్ నాయక్ గారి తమ్ముడు దుర్గాప్రసాద్ నాయక్ గారి వివాహానికి హాజరై, ఆ నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…ఈ వేడుకలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా గారు, జవ్వాజి మదన్ గారు, కామినేని సాయిబాబా గారు, కందుల రమణ గారు, తుపాకుల అప్పారావు గారు, తుబాటి శ్రీహరి గారు, తదితరులు పాల్గొన్నారు..
Author: chilakaluripetalocalnews@gmail.com
అంతర్జాతీయ యోగ మాసోత్సవ కార్యక్రమంలో కమిషనర్ పీ. శ్రీ హరిబాబు చిలకలూరిపేట :కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మాజీమంత్రి స్థానిక శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచనల మేరకు పురపాలక సంఘం నందు అంతర్జాతీయ యోగ మాసోత్సవ కార్యక్రమం మే 21 నుండి జూన్21వరకునిర్వహించనున్నారు.ఇందులో భాగంగాపురపాలక సంఘ కార్యాలయంలో ఉన్న మైలవరపు గుండయ్య మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు మొదటిరోజు జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పీ. శ్రీహరిబాబు మాట్లాడుతూ యోగ యొక్క ప్రయోజనాలు చాలా ఉన్నాయి అని, శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సును మెరుగుపరుస్తాయనీ పేర్కొన్నారు. యోగా యొక్క సాధారణ అభ్యాసం బలం, వశ్యత మరియు సమతుల్యతను మెరుగుపరుస్తుంది, రక్తపోటును తగ్గిస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు మానసిక స్పష్టతను పెంచుతుందనీ తెలిపారు. క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల శారీరక బలం మరియు సమతుల్యతఆరోగ్యంమెరుగుపడతాయి అని తెలియజేశారు.
అన్నదానానికి భారీ విరాళం పురుషోత్తమ పట్నం సాయిబాబా మందిరానికి50,000నగదు అందజేత చిలకలూరిపేట పట్టణంలో ని12వ వార్డ్ టీడీపీ నాయకులు తుళ్లూరి సాంబయ్యఆదిలక్ష్మి దంపతుల 60వ వివాహా మహోత్సవం సందర్భంగా స్థానిక పురుషోత్తమ పట్నం లో వేంచేసి ఉన్న శ్రీ షిర్డీసాయి మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మందిర ప్రధాన అర్చకులు మురికిపుడి లక్ష్మీ నారాయణ ,దంపతులు పేరు మీద అర్చన చేశారు. అనంతరం సాంబయ్య ఆదిలక్ష్మి దంపతులు సాయిబాబా మందిరంలో భక్తులకు అన్నదాన నిమిత్తం50000రూపాయల ను ఆర్థిక సహాయం అందించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు బత్తినేని శ్రీనివాసరావు కు ఈ50000ఆర్థిక సహాయాన్ని ఇచ్చారు. అదేవిధంగా పట్టణంలో ని చీరాల రోడ్డు లో ఉన్న బాపూజీ వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులు కు అన్నదనం పంపిణీ చేశారు. అన్నదానికి ఆర్థిక సహాయాన్ని అందించిన తుళ్ళూరి సాంబయ్య ఆదిలక్ష్మి దంపతులు ను పలువురు ప్రముఖులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప్పాలబాజి, ఉప్పాల సుభాని, ఉప్పాల…
యూట్యూబ్ న్యూస్ చానల్స్ జర్నలిస్ట్ ల సమస్యలు పరిష్కరించాలి. YJA.ఏపీ అసోసియేషన్ పల్నాడు జిల్లా కమిటీ జిల్లాలో పలు నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు,జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులకు వినతి పత్రాలు అందజేసిన పల్నాడు జిల్లా కమిటీ నాయకులు. యూట్యూబ్ న్యూస్ చానల్స్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలి, అక్రిడేషన్ కమిటీలో అవకాశం కల్పయించాలి. పల్నాడు జిల్లా //యూట్యూబ్ న్యూస్ చానల్స్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గుండారెడ్డి మల్లికార్జున రెడ్డి గారు, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ వల్లూరు. మధు సుధను రావు గారి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా కమిటీ నాయకత్వం ఆధ్వర్యంలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారికి, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ గారికి, ప్రభుత్వ చీఫ్ విప్ మరియు వినుకొండ శాసనసభ్యులు జివి ఆంజనేయులు గారికి, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గారికి, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ…
మాచవరం ఎస్ఐగా ఎం రోశయ్య బాధ్యతలు స్వీకరణ మాచవరం పోలీస్ స్టేషన్ ఎస్ఐగా ఎం రోశయ్య బుధవారం బాధ్యతలు చేపట్టారు గుంటూరు రైల్వే పోలీస్ విభాగంలో పనిచేస్తూ పదోన్నతి పై మాచవరం ఎస్సైగా బాధ్యతలు చేపట్టారు ఇప్పటివరకు పని చేసిన కే సతీష్ లాంగ్ లీవ్ పై వెళ్లారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపడితే కటిక చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది నూతన ఎస్సై రోసీలు శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు మీ రమేష్ సీనియర్ జర్నలిస్ట్ మాచవరం మండలం
నరసరావుపేట పట్టణంలోని భువనచంద్ర టౌన్ హాల్లో జరిగిన పల్నాడు జిల్లా మహానాడు కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు పాల్గొనడం జరిగింది. కడపలో ఈనెల 27, 28, 29 తేదీల్లో తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడు కార్యక్రమానికి జిల్లా నుండి భారీగా ప్రజల తరలి వెళ్లాలని కోరడం జరిగింది. జిల్లా ప్రగతికి, ప్రజల అభ్యున్నతికి ప్రజా ప్రతినిధులందరం కట్టుబడి ఉన్నామని తెలియజేస్తూ.. 2024 ఎన్నికల్లో కొనసాగించిన ఉత్సాహంతో నేతలు ముందుకు సాగినప్పుడే పార్టీ బలోపేతం అవుతుంది.
భీమేశ్వరస్వామి ప్రతిష్ఠా మహోత్సవంలో మాజీమంత్రి ప్రత్తిపాటి చిలకలూరిపేట మండలం గోవిందాపురంలో బుధవారం కన్నుల పండువగా జరిగిన శ్రీ గంగా సమేత భీమేశ్వర స్వామి వారి ప్రతిష్ఠ మహోత్సవంలో మాజీ మంత్రివర్యులు శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలుతో కలిసి స్వామి వారిని దర్శించుకున్న ఆయన, ప్రతిష్ఠ ఏర్పాట్లను పరిశీలించి నిర్వాహకులతో మాట్లాడారు. గ్రామస్తులంతా కలిసికట్టుగా స్వామివారి ప్రతిష్ఠామహోత్సవం నిర్వహించడంపై సంతోషం వ్యక్తంచేసిన ప్రత్తిపాటి వారిని అభినందించారు. ప్రత్తిపాటి, ఎంపీ లావు ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో నాయకులు నెల్లూరి సదాశివరావు, జవ్వాజి మధన్ మోహన్, షేక్ టీడీపీ కరిముల్లా, కామినేని సాయిబాబు, గుత్తా వెంకటేశ్వర్లు, కందుల రమణ, తుబాటి శ్రీహరి, తుపాకుల అప్పారావు, గోపి, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
చిలకలూరిపేట మండలం గోవిందపురం గ్రామంలో గంగా పార్వతీ సమేత శ్రీ భీమేశ్వర స్వామి మరియు పరివార దేవతల జీవ ధ్వజ, పున ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుండగా గ్రామ ప్రజలు మరియు భక్త బృందం వారి ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆ ప్రతిష్టా మహోత్సవ వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొని శ్రీ అమ్మవారి మరియు స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి,తీర్థ ప్రసాదాలు స్వీకరించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు, శ్రీ సోమేపల్లి వెంకటసుబ్బయ్య గారు… ఈ ప్రతిష్టా మహోత్సవము లో వారికి సాదర స్వాగతం పలికిన గుత్తా యామలయ్య గారు,నీరుకొండ బసవయ్య గారు, పావులూరి చంద్రమౌళి గారు, నీరుకొండ సుబ్బారావు గారు, పెద్ది కిషోర్ గారు, కల్లం చంద్రశేఖర్ రెడ్డి గారు, శశిధర్ గారు తదితరులు.
నరసరావుపేట పట్టణంలోని కాసు కన్వెన్షన్ నందు జరుగుచున్న చిలకలూరిపేట పట్టణ రత్న స్వగృహ ఫుడ్స్ అధినేత తవ్వా శ్రీను గారి కుమారుడు మరియు మునిసిపల్ వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీను గారి మేనకోడలి వివాహ మహోత్సవానికి హాజరై, ఆ నూతన వధూవరులు రాహుల్ – భార్గవి గార్లను ఆశీర్వదించి, వారికి వివాహ శుభాకాంక్షలు తెలియచేసిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…ఈ కార్యక్రమంలో షేక్ కరీముల్లా గారు, జవ్వాజి మదన్ గారు, కామినేని సాయిబాబా గారు, కందుల రమణ గారు, తుపాకుల అప్పారావు గారు, తుబాటి శ్రీహరి గారు, గట్టా హేమ గారు, కొల్లా ఉమా గారు తదితరులు పాల్గొన్నారు…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు నాడు సేవా సమితి తరపున చిలకలూరిపేట పట్టణ అధికార ప్రతినిధిగా చిలకలూరిపేట నియోజకవర్గంకాపు నాయకులు పెద్ది శెట్టి వెంకటరమణ నియామకం చేయడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి రాష్ట్ర కార్యాలయంలో పెద్ది శెట్టి వెంకటరమణ లో చిలకలూరిపేట పట్టణ అధికారి ప్రతినిధిగా నియమితులైన వెంకటరమణ కు జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు నియామక పత్రం అందించడం జరిగింది. తదుపరి నియమితులైన రమణను ఘనంగా సన్మానించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. నియామక పత్రం అందుకున్న వెంకటరమణ సంస్థ అన్ని కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేస్తానని సమస్త అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఈ నియామకం సహకరించిన జాతీయ నాయకులకు రాష్ట్ర నాయకులకు చిలకలూరిపేట నియోజకవర్గ నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏనుగుల వెంకటేశ్వర్లు…









