Author: chilakaluripetalocalnews@gmail.com

నాదెండ్ల మండలం లో పోలీసులు మెరుపు దాడులు కోడి పందాల స్థావరాలపై నాదెండ్ల పోలీసులు దాడులు చందవరం – సాతులూరు మధ్య (చందవరం వైపు) గల పొలాల్లో కోడిపందేల స్థావరంపై పోలీసులు దాడి నాదెండ్ల ఎస్సై పుల్లారావు సారథ్యంలో జరిగిన మెరుపు దాడి. భారీగా పట్టుబడిన ద్విచక్రవాహనాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సుమారు మూడు గంటల పాటు సాగిన దాడులు

Read More

రాష్ట్రానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టెటివ్ కమిటీ చైర్మన్ నియామకం FCI కమిటీ AP చైర్మన్ గా ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ను నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు FCI కమిటీ AP చైర్మన్ గా వీరు రాష్ట్రంలో పర్యటించి,ఆహార,ధాన్యం సేకరణ, కొనుగోలు, ఇతర పంటల ఉత్పత్తులు,ఆహార పదార్థాలు నాణ్యత తో సహా,పలు అంశాలపై అధ్యయనం చేస్తారు. FCI కమిటీ చైర్మన్ గా నియమించడం పట్ల ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కేంద్ర ప్రభుత్వానికి,ప్రధాని మోదీ కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Read More

జూన్ 4 – వెన్నుపోటు దినంవెన్నుపోటు దినం కార్యక్రమం విజయవంతం చేద్దాం అంటూ పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు అబద్దపు హామీలతో అధికారం లోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చేస్తున్న మోసాన్ని ఎండగడుతూ జూన్ 4న వెన్నుపోటు దినాన్ని నిర్వహించనున్న వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ. పల్నాడు జిల్లా వినుకొండ వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో వెన్నుపోటు దినం పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ PAC మెంబర్ వినుకొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు మరియు వైయస్ఆర్ సీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Read More

వెన్నుపోటు దినం.. కదం తొక్కుదాం..మాజీమంత్రి విడదల రజిని పిలుపు కూటమి మోసాల్ని ఎండకట్టేందుకే నిరసన అంటూ వెల్లడిజూన్‌ 4న వెన్నుపోటు దినం పేరుతో చిలకలూరిపేట పట్టణంలో భారీ ర్యాలీప్రజలతో కలిసి అధికారులకు వినతి పత్రాల సమర్పణపార్టీ శ్రేణులతో కలిసి కార్యక్రమం పోస్టర్‌ ఆవిష్కరణ చిలకలూరిపేట నియోజకవర్గంలో జూన్‌ 4వ తేదీన వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జరగనున్న ‘వెన్నుపోటు దినం‘ కార్యక్రమ పోస్టర్‌ను పార్టీశ్రేణులతో కలిసి మాజీ మంత్రి విడదల రజిని వారి నివాసంలో ఆవిష్కరించారు. ప్రజల మద్దతుతో జరిగే ఈ నిరసన ర్యాలీను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ నాయకులకు కార్యక్రమ నిర్వహణపై దిశానిర్ధేశం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఏర్పాటుచేసిన మెగా జాబ్ మేళకు ముఖ్యఅతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారు & వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ కొంజేటి నాగ శ్రీను రాయల్ గారు హాజరై జాబ్ మేళాను ప్రారంభించారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగ,ఉపాధి కల్పన లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ముందుకు వెళ్తున్నారని తెలిపారు. దీనిలో భాగంగానే వినుకొండలో మెగా జాబ్ మేళా నిర్వహించి వందలాదిమంది నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నిర్వహించే జాబు మేళ ను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని చీఫ్ విప్ జీవి గారు కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Read More

చిన్నారి అక్షితను ఆశీర్వదించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ పురుషోత్తపట్నం గ్రామ ప్రముఖ నాయకులు బైరా వెంకట కోటి గారి మనుమరాలు ( ఈదుపల్లి అంకా రమేష్ గారి కుమార్తె ) నూతన వస్త్ర బహూకరణ వేడుక సాయిబాబా దేవాలయంలోని ఫంక్షన్ హాల్ నందు జరుగుచుండగా ఆ వేడుకకు హాజరై చిన్నారి అక్షితను ఆశీర్వదించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు… ఈ వేడుకలో వారితో బైరా శేషాద్రి నాయుడు గారు, బైరా శేఖర్ గారు, తోట వెంకట బ్రహ్మ స్వాములు గారు, గ్రంధి ఆంజనేయులు గారు తదితరులున్నారు.

Read More

ప్రముఖ నటుడు, సేవావేత్త సోనూసూద్ ని కలిసిన మాజీమంత్రి ప్రత్తిపాటి నటనతోనే కాకుండా సేవా కార్యక్రమాలతోనూ నటుడు సోనూసూద్ ప్రజల మనసుల్లో నిలిచారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. శనివారం హైదరాబాద్ లోని ట్రైడెంట్ హోటల్లో మాజీమంత్రి నటుడు సోనూసూద్ తో మర్యాదపూర్వకంగా సమావేశమై సేవా కార్యక్రమాలపై మాట్లాడారు. ప్రత్తిపాటి ఫౌండేషన్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్ని ఎమ్మెల్యే ప్రత్తిపాటి సోనూసూద్ కి వివరించారు. తాజాగా చిలకలూరిపేట పట్టణంలో ప్రత్తిపాటి ఫౌండేషన్ నిర్వహించిన ఉచిత నేత్రవైద్య శిబిరం గురించి సోనూసూద్ కి ప్రత్తిపాటి తెలియచేశారు. వేలమందికి నేత్రవైద్యసేవలు అందించడంపై సోనూసూద్ సంతోషం వ్యక్తంచేసి, ప్రత్తిపాటిని అభినందించారు. ప్రత్తిపాటి ఫౌండేషన్ ఎప్పుడు స్థాపించింది.. ఇన్నేళ్లలో ఏ రకమైన కార్యక్రమాలు చేపట్టి, ప్రజలకు ఏ విధమైన సేవలు అందించిందనే వివరాల్ని ప్రత్తిపాటి ప్రజంటేషన్ ద్వారా సోనూసూద్ కి వివరించారు.

Read More

రామచంద్ర స్వామి వార్ల ప్రతిష్ఠా మహోత్సవంలో జీవి ఆంజనేయులుపాల్గొన్నారు. వినుకొండ నియోజకవర్గం, నూజెండ్ల మండలం, యోగిరెడ్డిపాలెం గ్రామo లో శ్రీసీతారామలక్ష్మణ హనుమత్ సమేత రామచంద్ర స్వామి వార్ల ప్రతిష్ఠా మహోత్సవంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారు పాల్గొన్నారు. జీవి గారు మాట్లాడుతూ, యోగిరెడ్డిపాలెం గ్రామంలో దేవాలయ నిర్మాణం మరియు విగ్రహ ప్రతిష్ఠాపన గ్రామస్తుల భక్తికి, ఐక్యతకు నిదర్శనమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు.తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Read More

వైసీపీ నుండి తెలుగుదేశం లోకి చేరిన కుంభా బాబు చిలకలూరిపేట నియోజకవర్గం అభివృద్ధి చేయటం ప్రత్తిపాటి పుల్లారావుకే సాధ్యమని, బడుగుబలహీన వర్గాలకు న్యాయం జరగాలి అంటే తెలుగుదేశం పార్టీ తోనే సాధ్యమని మురికిపూడి గ్రామంలో ఎస్టీ కాలనీ కీ చెందిన వైసీపీ నాయకుడు కుంభా బాబు, వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీ లోకి మండల పార్టీ అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్ , గ్రామ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో చేరడం జరిగింది, ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ నాయకులు చెన్నుపాటి నాగరాజు , చిగురుపాటి రాజు , కోనకి నాగ మహేంద్ర , కొమ్మనబోయిన రామారావు , షేక్ శ్రీను భాషా , ఉయ్యాల తిరుపతయ్య , ఉయ్యాల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Read More

వైయస్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో వెన్నుపోటు దినం పోస్టర్‌ను ఆవిష్కరించిన మాజీ మంత్రి విడదల రజిని పల్నాడు జిల్లా నరసరావుపేటలోని వైయస్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో వెన్నుపోటు దినం పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి విడదల రజిని అబద్దపు హామీలతో అధికారం లోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రజలకు చేస్తున్న మోసాన్ని ఎండగడుతూ జూన్ 4న వెన్నుపోటు దినాన్ని నిర్వహించనున్న వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలుకులు గౌతమ్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యేలు, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Read More