ప్రత్తిపాటి ఆదేశాలతో పార్టీలకు అతీతంగా వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు:మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని

చిలకలూరిపేట: స్థానిక పురపాలక సంఘ పరిధిలోనీ వివిధ వార్డులలో జరుగుతున్నఅభివృద్ధి పనులు,మరియ మంచినీటి సరఫరా పై ప్రజల నుంచి వచ్చిన విన్నతలను స్వయంగా ఆయా ప్రాంతాలకు వెళ్లి పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీమంత్రి స్థానిక శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పట్టణాభివృద్ధి పై జరిపే ప్రతి సమీక్ష సమావేశంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది.ఆయా సమీక్ష సమావేశాలకు కొంతమంది కౌన్సిల్ సభ్యులు హాజరైన హాజరు కాక పోయినపార్టీలకు అతీతంగా రాగద్వేషాలకు పోకుండా, ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకొని వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని వారి ఆదేశానుసారం పట్టణ ప్రాంతాల్లో ఉన్న అన్ని వార్డుల పరిధిలో పార్టీలకు అతీతంగా రోడ్లు , డ్రైనేజీ లు, కల్వర్టులు, పైపు లైన్ మరమ్మతులు.నూతన పైపు లైన్ నిర్మాణాలు చేపట్టటం జరుగుతుందని తెలిపారు.

దాంట్లో భాగంగానే వార్డుల్లో పర్యటించి జరుగుతున్న పనులను. అదే విధముగావార్డుల పరిధిలో ఇంకేమైనా సమస్యలు ఉన్నాయో.స్థానిక నాయకులను సంప్రదించి వాటి కృషి చేయాలని ఎమ్మెల్యే ఆదేశాలతో 9,11 వార్డులలో పర్యటిస్తున్నట్లు తెలిపారు.ఆయా పర్యటనలో వారి వెంట మున్సిపల్ ఏ ఈ మణి కుమార్,టీడీపీ నాయకులు బెజ్జం రవి,దాసు,ఫ్రాన్సిస్,తదితరులు ఉన్నారు

Share.
Leave A Reply