రోడ్లపై పశువులను వదిలివేస్తున్న యజమానులకు పురపాలక సంఘం వారి హెచ్చరిక
చిలకలూరిపేటపట్టణంలో ఆవులు, గేదెలు రోడ్లపై తిరగడం వల్ల తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోందని మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబుతెలిపారు
పశువుల వల్ల పారిశుద్ధ్య పనులకు కూడా ఆటంకం కలుగుతోందని ఈ సమస్యను పరిష్కరించేందుకు పురపాలక సంఘం కఠిన చర్యలకు సిద్ధమైంది.
రాబోయే మూడు రోజులలోపు తమ పశువులను రోడ్లపై వదిలివేయకుండా, వాటిని తమ సంరక్షణలో ఉంచుకోవాలని పశువుల యజమానులను ఆదేశించింది.
ఈ ఆదేశాలను పాటించని పక్షంలో, పురపాలక సంఘం ఆ పశువులను స్వాధీనం చేసుకుని గోశాలకు తరలిస్తుందని హెచ్చరించింది.
అంతేకాకుండా, సంబంధిత యజమానులపై చట్టపరమైన కేసులు కూడా నమోదు చేయబడతాయని మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరి బాబు స్పష్టం చేశారు
పట్టణ ప్రజల భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పారిశుద్ధ్యం పరిరక్షణకు ఈ చర్యలు తప్పవని పురపాలక సంఘం పేర్కొంది.



