శివాపురంలో ‘సుపరిపాలన’ ప్రచారం లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి గారు

ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసే లక్ష్యంతో “సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి ప్రచారం” కార్యక్రమo వినుకొండ మండలం, శివాపురం గ్రామంలో ఈ కార్యక్రమo లో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారు పాల్గొన్నారు. జీవి గారు గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పారదర్శక పాలన ఆవశ్యకతపై ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. “ప్రతి ఒక్కరికీ సుపరిపాలన ఫలాలు అందాలనేదే మా ప్రభుత్వ సంకల్పం. దీనిలో భాగంగానే ఈ ఇంటింటి ప్రచారం చేపడుతున్నాం. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share.
Leave A Reply