1200 ఓటర్లు దాటిన పోలింగ్ స్టేషన్ల పరిధిలో నూతనంగా పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు
చిలకలూరిపేట నియోజకవర్గంలో ఇప్పటివరకూ మొత్తం 242 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో 239 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ఎన్నికల అనంతరం ఎన్నికల సంఘం వారు తీసుకున్న చర్యల మేరకు 1500 ఓటర్లు పైబడి ఉన్న పోలింగ్ కేంద్రాలు స్థానంలో కొత్త పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది.పట్టణ పరిధిలో 3 పోలింగ్ కేంద్రాలలో 1500 ఓటర్లు పైబడి ఉన్న కారణంగా నూతనంగా 3 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిన కారణంగా, ప్రస్తుతం 242 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అయితే ఇటివల ఎన్నికల సంఘం వారు తీసుకున్న చర్యలలో భాగంగా 1200 ఓటర్లు పైబడిన పోలింగ్ కేంద్రాలలో సైతం నూతనంగా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలన్న మార్గదర్శకాల మేరకు పట్టణంలో 27 పోలింగ్ కేంద్రాలు, చిలకలూరిపేట రూరల్ మండలం పరిధిలో 4 పోలింగ్ కేంద్రాలు, నాదెండ్ల మండలం పరిధిలో 3 పోలింగ్ కేంద్రాలు నూతనంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం వారు ప్రతి నెల జరిపే రాజకీయ పార్టీ ప్రతినిధుల సమావేశంలో సదరు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు గురించి చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులుమాట్లాడుతూ, ఓటర్లు సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నూతన పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. నూతనంగా ఏర్పాటు చేసే పోలింగ్ కేంద్రాల జాబితాను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అధికారులు అందజేయడం జరిగింది.ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు మురకొండ మల్లిబాబు,అజహరుద్దీన్,ycp నుండి విడదల శ్రీనివాసరావు, కాంగ్రెస్ నుండి M. రాధా కృష్ణ, జనసేన నుండి కోట సాంబ,సుభాని, నవతరం నుండి రావు సుబ్రమణ్యం తదితరులు పాల్గొనగా,అధికారులు ERO రమేష్,AERO లు పేట పురపాలక సంఘం కమీషనర్ పతి శ్రీ హరిబాబు,చిలకలూరిపేట తహసీల్దారు హుస్సేన్, నాదెండ్ల తహసీల్దారు చంద్ర శేఖర్, యడ్లపాడు తహసీల్దారు విజయ శ్రీ తదితరులు పాల్గొనడం జరిగింది.
Trending
- పేద విద్యార్థులకు నగదు పురస్కారాలు అందించిన ప్రత్తిపాటి
- ప్రత్తిపాటి సమక్షంలో టీడీపీ గూటికి చేరిన వైసీపీ కార్యకర్తలు
- క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి : ప్రత్తిపాటి
- పల్నాడు జిల్లా కలెక్టర్కు జనతా వారధి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు
- రాజ్యసభ సభ్యునిగా సాయినాథుని మొక్కులు చెల్లించుకున్నా: భాష్యం రామకృష్ణ
- పశుపోషణతో అదనపు ఆదాయం : ప్రత్తిపాటిరైతుల సహకారంతో సంగం వ్యవస్థను మరింత వృద్ధిలోకి తెస్తాం : దూళిపాళ్ల
- పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇంచార్జ్ డీఆర్ఓ గారికి రాష్ట్రంలో సెప్టిక్ ట్యాంకుల నుంచి సేకరిస్తున్న మానవ మలమూత్ర వ్యర్థాల తక్షణ చర్యలు తీసుకోవలసిందిగా జనతా వారధి తరపున వినతిపత్రం సమర్పణ
- పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డ్వాక్రా మహిళల సమస్యలపై జనతా వారధి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పణ



