వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో ‘బాబు ష్యూరిటీ …మోసంగ్యారంటీ’ కార్యక్రమం సూపర్ సిక్స్ హామీల అమలుపై ప్రశ్నిస్తూ బహిరంగసభ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలను అమలు చేయాలంటూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘బాబు ష్యూరిటీ మోసం – గ్యారంటీ’ పేరుతోఈ రోజు గురువారం (జూలై 17) కార్యక్రమం నిర్వహించనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు మాజీ మంత్రి విడదల రజిని నేతృత్వంలో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఉదయం 10 గంటలకు ఎన్‌ఆర్‌టీ రోడ్డులోని మాజీ మంత్రి విడదల రజిని నివాసం వద్ద ప్రారంభం అయ్యే ఈ బహిరంగ సభలో వైఎస్సార్‌సీపీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాసు మహేష్‌రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకరరావు, సత్తెనపల్లి సమన్వయకర్త గజ్జెల సుధీర్‌భార్గవ్‌రెడ్డి, నరసరావుపేట పార్లమెంట్ పరిశీలకులు పూనూరు గౌతమ్‌రెడ్డి, మాజీపార్లమెంట్ సభ్యులు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ,అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ తదితరులు పాల్గొని ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచీ పెద్ద ఎత్తున తరలిరావాలని మాజీ మంత్రి విడదల రజిని పిలుపునిచ్చారు. చంద్రబాబు హామీ ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణాలు మహిళలకు, ఉద్యోగాలు యువతకు, పెట్టుబడి సాయం రైతులకు వంటి సూపర్ సిక్స్ హామీలు కేవలం మోసపు మాటలేనని, ప్రజలు వాటిని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రజల తరపున ఈ ప్రశ్నలు వేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, నియోజకవర్గవ్యాప్తం గా ఈ కార్యక్రమం జరుతుంది అని తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి హామీల అమలుకు బలంగా నిలబడి ప్రజల పక్షాన పోరాటం చేస్తామని తెలిపారు .
Trending
- భోగిపండ్లు పోయడం వెనుక ఆచారం చాలా ఆసక్యంగా ఉంటుంది.
- వైసీపీ నేతలు దహనం చేయాల్సింది జీవోలు కాదు.. తమలోని విద్వేష లక్షణాలు.. వినాశనకర ఆలోచనల్ని: ప్రత్తిపాటి
- భోగి పండగ గురించి
- చిలకలూరిపేట అగ్ని హర్షిదాతు ఎం.ఎస్.ఎం.ఈ పార్కుకు ఆమోదం : జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా.
- బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు
- పల్నాడు జిల్లా…. జనతా వారిది కార్యక్రమంలో సమస్యలతో వచ్చిన బాధితులను తీసుకొని పరిష్కార దిశగా జిల్లా కలెక్టర్ కార్యాలయం లో అధికారులను కలవడం జరిగింది
- ఘనంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని నిర్వహించిన బిజెపి నాయకులు
- సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని నిర్వహించిన చిలకలూరిపేట బిజెపి పార్టీ



