జగ్గాపురంలో వైసీపీకి షాక్ 54 మంది జనసేనలోకి! ఎడ్లపాడు మండలం, జగ్గాపురం గ్రామానికి చెందిన 54 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ నాయకత్వం పట్ల ఆకర్షితులై, జనసేన నాయకుల సేవాభావాన్ని చూసి పార్టీలో చేరుతున్నామని తెలిపారు. జనసేనతోనే గ్రామాల అభివృద్ధి, సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని తాము నమ్ముతున్నామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ పరిపాలనకు ఆకర్షితులవుతున్నారని, ఆయన గ్రామీణ వ్యవస్థలను బలపరుస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. పార్టీలో చేరిన వారికి సంపూర్ణ మద్దతు, సముచిత గౌరవం లభిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన వారిలో ముఖ్యులు తులసి రత్తయ్య, చౌడవరపు రామరావు, తెనాలి…
Author: chilakaluripetalocalnews@gmail.com
చిలకలూరిపేట-ఓడరేవు జాతీయ రహదారిపై పసుమర్రు వద్ద రోడ్డు ప్రమాదం సైకిల్ పై వెళుతున్న వ్యక్తిని ఢీకొన్న గుర్తు తెలియని వాహనం స్పాట్ లొనే వ్యక్తి మృతి…. ధ్వంసమైన సైకిల్ చిలకలూరిపేట రూరల్ పోలీసులు కు సమాచారం ఇచ్చిన హైవే పై పని చేస్తున్న సిబ్బంది ఘటన స్థలాన్ని పరిశీలించి న రూరల్ పోలీసులు మృతి చెందిన వ్యక్తి పట్టణంలో ని బొందిలి పాలెం ప్రాంతానికి చెందిన బీకం శ్రీనివాస్ సింగ్ గా గుర్తింపు
చిలకలూరిపేట MEO గా సత్యనారాయణ సింగ్ భాద్యతలు చిలకలూరిపేట మండల విద్యా శాఖ అధికారిగా బి. సత్యనారాయణ సింగ్ నియామకం సోమవారం ఉదయం చిలకలూరిపేట మండల కార్యాలయంలో భాద్యతలు స్వీకరించిన MEO నరసరావుపేట ZP హైస్కూలు నుంచి బదిలీ పై ఇక్కడకు వచ్చిన సత్యనారాయణ సింగ్ ఆగస్టు నెలలో MEO గా పదోన్నతి కల్పించనున్న విద్యా శాఖ ఇప్పటి వరకు చిలకలూరిపేట లో ఇంచార్జి MEO గా పని చేసిన శ్రీనివాసరావు కు సత్తెనపల్లి మండలానికే పూర్తి భాద్యతలు కేటాయింపు పాఠశాలల్లో పరిశుభ్రత పాటించక పోతే చర్యలు తప్పవు-MEO పాఠశాలల్లోనాణ్యమైన మధ్యాహ్న భోజనం విద్యార్థులు కు అందించాలన్న-MEO చిలకలూరిపేట మండలం బొప్పుడి గ్రామంలో పలు పాఠశాలలను ఆకస్మిక తనిఖీలు చేసిన-MEO సత్యనారాయణ సింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనధికార లే అవుట్ ల క్రమబద్ధీకరణ కోసం ఏర్పాటు చేసిన అవకాశాన్ని వినియోగించుకోవాలికేంద్ర ప్రభుత్వ ప్రియతమ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్ర అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు నిధులను కేటాయించడం రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడటం ఎంతో హర్షించదగ్గ విషయం నిధులు కేటాయించినందుకు ప్రధానమంత్రి కి పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నా సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గార్ల నాయకత్వం లో 2025 జూన్ 30వ తేదీలోపు అనధికారికంగా వేసిన లేఔట్లను క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ సదవకాశం ను ప్లాట్లు కొనుగోలు చేసిన యజమానులు లే అవుట్ వేసిన యజమానులు వెంటనే స్పందించి తమ తమ ప్లాట్లు లేఔట్లు క్రమబద్ధీకరించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.…
తిమ్మాపురం కొత్త బైపాస్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం వేగంగా డీవైర్ ను ఢీకొన్న బుల్లెట్ వాహనం చిలకలూరిపేట నుంచి గుంటూరు వైపు వెళుతున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదం బుల్లెట్ వాహనం పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ఘటన స్థలాన్ని పరిశీలించి న యడ్లపాడు పోలీసులు గాయపడిన వారిని గుంటూరు వైద్యశాలకు తరలించారు మేడికొండురు మండలం పాలడుగు గ్రామనికి చెందిన వారిగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది
చిలకలూరిపేట కాపు కళ్యాణ్ మండపం పునర్ నిర్మాణ కార్యక్రమం లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావుఈరోజు ఉదయం 10 గంటల కు స్థానిక కృష్ణారెడ్డి డొంక లో ఉన్న చిలకలూరిపేట కాపు కళ్యాణ్ మండపం పునర్ నిర్మాణ కార్యక్రమం లో భాగంగా కళ్యాణ మండపం ముఖ ద్వారాన్ని ఏర్పాటు కోసం పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది . తదుపరి చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉన్న ముఖ్య కాపు నాయకులు నిర్మాణ కార్యక్రమాన్ని ఎలా కొనసాగించాలి అనే అంశంపై మీటింగు ఏర్పాటు చేసుకొని అందులో ముఖ్య నాయకులను తాత్కాలిక కమిటీ గా ఏర్పాటు చేసుకొని ఆర్థిక వనరుల కోసం పట్టణంలోని కాపు కుటుంబ సభ్యులను అలాగే నియోజకవర్గంలో ఉన్న కాపు కుటుంబ సభ్యులను కలిసి నిర్మాణ పనుల గురించి వివరించి ఆర్థిక సహాయం కోసం తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలని కోరదామని పాల్గొన్న కాపు కుటుంబ…
, పల్నాడు జిల్లా గురజాల అసెంబ్లీ నియోజవర్గ స్థాయిలో కన్వీనర్ ఆరె వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో…… గురజాల శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారి కళ్యాణ మండపంలో * కార్గిల్ విజయ్ దివాస్ * సందర్భంగా అమర జవాన్లకు నివాళులర్పించడం జరిగినది…..
జంట హత్యల కేసులో ప్రధాన నిందితుడుగా వైసీపీ నేత ఈ నెల 23న నరసరావుపేటలో తండ్రీకొడుకుల కిడ్నాప్, హత్య బెంగళూరు నుంచి కోర్టు పని మీద వచ్చిన సమయంలో ఘటన సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు దర్శి నియోజకవర్గ వైసీపీ మాజీ ఇన్ చార్జి మాధవరెడ్డి ప్రధాన నిందితుడుగా గుర్తింపు పల్నాడు జిల్లాలో ఇటీవల జరిగిన జంట హత్యలు తీవ్ర కలకలం రేపిన విషయం విదితమే. ఈ కేసులో నిందితులను పోలీసులు గుర్తించారు. ఈ నెల 23న నరసరావుపేటలో ఇద్దరు రియల్టర్లు (తండ్రీకొడుకులు) దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యలకు సూత్రధారి వైకాపా నేత బాదం మాధవరెడ్డి అని పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిర్ధారణకు వచ్చారు. కిడ్నాప్, హత్యలో మాధవరెడ్డితో పాటు మరో ఆరుగురు పాల్గొన్నట్లు గుర్తించారు. మాధవరెడ్డి గతంలో దర్శి నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహించారు. విషయంలోకి వెళితే.. బెంగళూరులో…
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా,అధికారులు విస్తృతంగా తనిఖీలు… చిలకలూరిపేట:నిషేధితప్లాస్టిక్ నిరోధానికి సిఏం సి ఏర్పాటు చేసిన మున్సిపల్ సిబ్బంది శనివారం నాడు ఒకటవ డివిజన్ లో విస్తృత తనిఖీలు చేపట్టారు. చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ పీ. శ్రీ హరిబాబు ఆదేశాల మేరకు ఒకటవ డివిజన్ శానిటరీ ఇనస్పెక్టర్ సి.హెచ్.రమణారావు ఆధ్వర్యంలో జరిగిన విస్తృత తనిఖీలు.ఈ తనిఖీల్లో నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు (సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు, బాక్సులు, గ్లాసులు మొదలైనవి)స్వాధీనం పరుచుకున్నారు.ప్రధాన వాణిజ్య ప్రాంతాలు,మార్కెట్లు, రెస్టారెంట్లు మరియు దుకాణాలపై ప్రత్యేక బృందాలు దాడులు చేశాయి.ప్లాస్టిక్ కవర్లు, డిస్పోజబుల్ ప్లేట్లు, కప్పులు వంటి నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తుల వాడకంపై అధికారులు నిశితంగా పరిశీలించారు.ఈ తనిఖీలలో,అనేక దుకాణాలు మరియు వ్యాపార సంస్థలు నిషేధిత ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు.వీటిలో కొన్నింటికి భారీ జరిమానాలు విధించగా, మరికొన్నింటికి హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా చిన్నపాటి కిరాణా దుకాణాలు, పండ్ల విక్రయదారులు మరియు వీధి వ్యాపారులు ఇంకా…
భారతదేశ చరిత్రలో అత్యధిక రోజులు పనిచేసిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ రికార్డ్భారతదేశంలో ప్రధానమంత్రిగా పనిచేసిన వారిలో కాంగ్రెస్ పార్టీ నుంచి స్వర్గీయ ఇందిరాగాంధీ 4077 రోజులు పని చేసిన ప్రధాన మంత్రిగా గుర్తింపు ఉంది. ఆ గుర్తింపును బ్రేక్ చేస్తూ భారతీయ జనతా పార్టీ నుంచి 4078 రోజులు పని చేసిన చేస్తున్న ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఆ రికార్డును బ్రేక్ చేశారు. అత్యంత ప్రజా ఆదరణ కలిగిన నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న మల్లెల శివ నాగేశ్వరావు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు.









