భూగర్భ జలాల పెంపు ప్రజల కనీస బాధ్యత : ప్రత్తిపాటి
- ప్రభుత్వ భవనాలతో పాటు ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత ఉండాలి.
- ఎల్ నినో, వాతావరణ మార్పులతో భవిష్యత్ లో నీటి కొరత ఏర్పడవచ్చు.
- ప్రజలు నీటి పొదుపుతో పాటు.. నీటి సంరక్షణపైనా దృష్టి పెట్టాలి.
- పరిశుభ్రత.. నీటి భద్రతను ప్రజల జీవన విధానంగా మారాలి.
- స్వచ్చాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మాజీమంత్రి ప్రత్తిపాటి.
- పారిశుధ్య సిబ్బంది, ప్రజలతో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించిన ఎమ్మెల్యే.
పరిశుభ్రత..నీటి భద్రతను ప్రజలు తమ జీవనవిధానంగా మార్చుకోవాలని, భూగర్భ జలాల పెంపు దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని, నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు.
చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో శనివారం నిర్వహించిన స్వచ్చాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్తిపాటి, పారిశుధ్య సిబ్బంది, ప్రజలతో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలో తవ్విన ఇంకుడు గుంతను పరిశీలించారు.
అనంతరం నీటి భద్రత.. పరిసరాల పరిశుభ్రతపై మున్సిపల్, సచివాలయ సిబ్బందికి ప్రత్తిపాటి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
జల సంరక్షణ చర్యల్ని సమర్థవంతంగా అమలుచేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దేశానికే మార్గదర్శిగా నిలిచారని, గతంలోనే ఆయన ఇంకుడు గుంతల తవ్వకంపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని, జన్మభూమి కార్యక్రమంతో నీటి పొదుపు మార్గాలను ప్రజలు పాటించేలా చేశారని ప్రత్తిపాటి పేర్కొన్నారు. ప్రజలు పరిసరాల శుభ్రతపై ఎంత శ్రద్ధ పెడుతున్నారో, నీటిభద్రతపైనా అంతే శ్రద్ధ పెట్టాలని, ఆ దిశగా మున్సిపల్ , స్వర్ణ వార్డు సిబ్బంది ప్రజల్లో అవగాహన పెంచాలని ప్రత్తిపాటి సూచించారు. ప్రతి ఇంటిలో ఇంకుడుగుంత ఉండేలా చూడాలని, వర్షపు నీటితో పాటు, ఇళ్లలో వాడుకునే వృథానీరు కూడా భూమిలోకి వెళ్లేలా చర్యలు చేపట్టాలన్నారు.
స్వచ్ఛ చిలకలూరిపేట ర్యాంకింగ్స్ లో మన మున్సిపాలిటీ రాష్ట్రంలోనే రెండోస్థానంలోనిలిచిందన్న ప్రత్తిపాటి. ప్రజలు, పురపాలక సిబ్బంది సంయుక్త సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు. భవిష్యత్ లో రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలవాలన్న లక్ష్యంతో పురపాలక సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని, లక్ష్యసాధనకు ప్రజలు కూడా నిబద్ధతతో పనిచేయాలని ప్రత్తిపాటి సూచించారు.
కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ రఫాని, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ కందుల రమణ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, బీజేపీ నాయకులు మల్లెల శివనాగేశ్వరరావు, టీడీపీ నాయకులు మద్దిబోయిన శివ, బేరింగ్ మౌలాలి, షేక్ మస్తాన్ వలి, కొత్త కోటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి, ఎమ్మార్వో హుస్సేన్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.



