ప్రజల కోసం ఇంటింటి జనగణనపై యానిమేటర్లకు ప్రత్యేక శిక్షణ.. హాజరైన అధికారులు.

చిలకలూరిపేట రూరల్ మండలం లో జనగణన-2027 శిక్షణా తరగతులు రెండో రోజు

చిలకలూరిపేట
పట్టణంలోని అసిస్ట్ మీటింగ్ హాలు నందు జనగణన-2027కు సంబంధించి చిలకలూరిపేట రూరల్ మండల పరిధిలోని సూపర్ వైజర్లు మరియు యానిమేటర్లకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతులు బుధవారం రెండో రోజుకు చేరుకున్నాయి. ఇండ్ల జనగణన ప్రక్రియపై క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించారు.
డిజిటల్ జనగణన: ఈ సందర్భంగా చిలకలూరిపేట తహశీల్దారు మాట్లాడుతూ, ‘డిజిటల్ భారత్’లో భాగంగా ఈసారి జనగణన ప్రక్రియను పూర్తిగా మొబైల్ యాప్ ద్వారా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం ఇండ్ల గణన ప్రక్రియ జరుగుతుందని, ప్రధాన జనగణన 2027 ఫిబ్రవరిలో* ఉంటుందని ఆయన వివరించారు.
సెల్ఫ్ ఎన్యూమరేషన్: ఈసారి జనగణనలో ప్రజలు తమ వివరాలను తామే నమోదు చేసుకునే ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్ సౌకర్యం కల్పించడం ఒక ప్రత్యేకత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు శిక్షణా కార్యక్రమములో ఫీల్డ్ ట్రైనర్లుగా మాధవరావు మరియు టి.రాజేష్ వ్యవహరించి, యాప్ వినియోగం మరియు గణనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో:
స్వరూపారాణి (ఏ.యస్.ఓ)

  1. మండల రెవిన్యూ ఇన్ స్పెక్టర్ (చిలకలూరిపేట)
  2. రూరల్ మండల సూపర్ వైజర్లు మరియు యానిమేటర్లు తదితరులు పాల్గొన్నారు.

తహశీల్దార్ కార్యాలయం, చిలకలూరిపేట.*

Share.
Leave A Reply