అనితర సాధ్యుడు అజరామరుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్
రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి గోవిందు శంకర్ శ్రీనివాసన్.
సామాన్య నిరుపేద కుటుంబంలో పుట్టి అసామాన్యునిగా ప్రపంచ ప్రజల నీరాజనాలు అందుకున్న మేధావి బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి గోవిందు శంకర్ శ్రీనివాస్ అన్నారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135 జయంతి కార్యక్రమం చిలకలూరిపేట కాంగ్రెస్ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం ప్రసన్న అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటానికి రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి గోవిందు శంకర శ్రీనివాస్ రైజ్ సంస్థ డైరెక్టర్ చుక్కా విన్సెంట్ పాల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం ప్రసన్న రాష్ట్ర కాంగ్రెస్ మాజీ కార్యదర్శి ఉప్పుటూరి అనిల్ కుమార్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కోవూరి శ్రీధర్ పూలమాలలు వేసి ఘనంగా జయంతి జేజేలు పలికారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి రైజ్ సంస్థ డైరెక్టర్ విశ్రాంత ఉపాధ్యాయుడు చుక్క విన్సెంట్ పాల్ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మేధావిని బహుముఖ ప్రజ్ఞాశాలిని కన్న భరతమాత ధన్యురాలని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సార్వభౌమాధికారానికి ప్రతీక అయిన ఓటు హక్కును ప్రతి ఒక్క వయోజనునికి అందించి మేలు చేస్తే నేడు ఆ ఓటు విక్రయవస్తువుగా మారటం దురదృష్టకరమని అన్నారు. సభాధ్యక్షుడు ప్రసన్న మాట్లాడుతూ రిజర్వేషన్ వర్గాల వారికి ప్రత్యక్ష దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త ఎం రాధాకృష్ణ మాట్లాడుతూ హిందువులు పవిత్రంగా భగవద్గీతను భావిస్తే ముస్లింలు ఖురాన్ ను క్రైస్తవులు బైబిలు భావిస్తారని కానీ 140 కోట్ల మంది భారతీయులు భావించే పవిత్ర గ్రంథం భారత రాజ్యాంగం అని గుర్తించి నిరంతరం తన చేతిలో తన గుండెలో రాజ్యాంగాన్ని నిక్షిప్తం చేసుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారని క్షణక్షణం అనుక్షణం భారత ప్రజలకు గుర్తు చేస్తున్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ గారని అన్నారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్త ఎం రాధాకృష్ణ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం ప్రసన్న రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి గోవిందు శంకర్ శ్రీనివాస్ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ కార్యదర్శి ఉప్పుటూరి అనిల్ కుమార్ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి షేక్ కరిమున్ రాష్ట్ర కాంగ్రెస్ మైనారిటీ సెల్ కార్యదర్శి షేక్ నస్రుద్దీన్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చే రెడ్డి శ్రీరామ రెడ్డి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు రెడ్డెం నర్సిరెడ్డి కోవూరి శ్రీధర్ ఎరగళ్ళ రవికుమార్ నాదెండ్ల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ బాజీ న్యాయవాది ఎప్పాల అంజిరెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇంటూరి భవాని వెంకటేష్, గోవిందు ప్రభాకర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కారుచోల స్వప్న కుమార్,చిలకా నాగరాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు నందిగం సాంబయ్య మిరియాల వెంకటరత్నం
పల్లె పోగు రాజు దాసరి శ్యాంబాబు మంగళగిరి శ్రీనివాసరావు మైనారిటీ నాయకులు షేక్ లాలూ సలాం,షేక్ హుస్సేన్ షేక్ మహమ్మద్ రఫీ షేక్ మస్తాన్ షరీఫ్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం నాయకులు అన్నపురెడ్డి వెంకటేశ్వర్లు పిచ్చయ్య ఆచారి, కుంచాల ఆంజనేయులు కుంచాల సాంబయ్య ఎన్ దుర్గ, కొండె బోయిన శ్రీనివాసరావు కొత్తకోట మల్లికార్జునరావు మైనారిటీ నాయకులు షేక్ హుస్సేన్ షేక్ ఫక్రుద్దీన్ షేక్ సుభాని షేక్ జానీ ఎస్సీ నాయకులు సి.హెచ్. ఎలిజబెత్ రాణి దావల మరియ దాసు కొమ్మ తోటి శ్రీనివాసరావు ఎర్ర సాని కోటేశ్వరరావు చెన్నుపాటి శ్రీనాథ్ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.



