“పోదాం పోదాం సర్కారు బడికి పోదాం” నినాదాలతో అవగాహన ర్యాలీ
చిలకలూరిపేట లోకల్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు మేరకు ఈనెల 18నుంచి23వరకు పాఠశాల ఆవాస్ ప్రాంతంలో బడి ఈడు కలిగిన పిల్లలను బడి బయట ఉండకుండా బడిలో చేర్చుకునే విధంగా బడిబాట ర్యాలీ నిర్వహించాలని అదేవిధంగా చదువు మధ్యలో ఆపేసిన డ్రాప్స్ తిరిగి పాఠశాలలో చేర్పించే విధంగా ఈ ర్యాలీ అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు నూతన 2026-27విద్యా సంవత్సరంలో పాఠశాల ఆవాస ప్రాంతంలో బడి ఈడు కలిగిన పిల్లలందరూ బడిలోనే ఉండాలని బాల కార్మికులు కానీ నవ ఎన్రోల్మెంట్ గాని ఉండకూడదని ఉద్దేశంతో అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో పోదాం పోదాం -సర్కారు బడికి పోదాం,డబ్బులు ఎందుకు దండగ -సర్కారు బడి ఉండగా వంటి నినాదాలతో విద్యార్థులు పోలిరెడ్డి పాలెం లో బడిబాటర్యాలీ నిర్వహించడం జరిగింది ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభించి విద్యార్థిని విద్యార్థులు చేర్చుకోవడం జరుగుతుందని అవాస ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రులను ప్రభుత్వ పాఠశాల ఇస్తున్న సౌకర్యాలగురించి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఉచిత యూనిఫామ్, విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, షూ, బెల్ట్, సాక్స్ పంపిణీ (21వస్తువులు ) ఇంగ్లీష్ మీడియం లో అత్యున్నత ప్రమాణాలు కలిగిన విద్యాబోధన, డిజిటల్ విద్యాబోధన కి పట్ల అవగాహన కల్పించి ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాలలో చేరాలని కోరడం జరిగింది కావున విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు వైఎస్ఆర్ కాలనీ, మదర్ తెరెసా కాలనీ, లక్ష్మీనరసింహ కాలనీ, పోలిరెడ్డిపాలెం,కోండ్రుపాడు ఆవాస ప్రాంతంలోని విద్యార్థిని విద్యార్థులు మున్సిపల్ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వం అందించే సౌకర్యాలు పొందాలని తెలిపారు, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన డిజిటల్ రూపంలో జరుగుతుందని అత్యున్నత విద్యా ప్రమాణాలు కలిగిన కృత్యా ద్వారా బోధన జరుగుతుందని తెలిపారు, పాఠశాల విద్యార్థులు ప్రభుత్వ బడి -చదువుల గుడి, ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి, ఇంటింటా చదువు- ఊరంతా వెలుగు, బాల కార్మిక వ్యవస్థ -నిర్మూలించండి, పెద్దలు పనికి- పిల్లలు బడికి వంటి నినాదాలు చేశారు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జై హైమావతి ఉపాధ్యాయులు పి శై లజ పోటుశ్రీనివాసరావు జి ఆదిలక్ష్మి కె అరుణ సిహెచ్ నవ్యశ్రీ పేరెంట్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు,



