చిలకలూరిపేట మండలం లింగం గుంట్ల గ్రామ వాస్తవ్యులు పెడవల్లి చంద్రశేఖర్ గారి కుమార్తెకి- కమ్మవారిపాలెం గ్రామ వాస్తవ్యులు గుత్తా శ్రీనివాసరావు గారి కుమారునికి చిలకలూరిపేట పట్టణంలోని నన్నపనేని వెంకటరత్నం కన్వెన్షన్ నందు వివాహం జరుగుచుండగా ఆ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులు డాక్టర్ శ్రావ్య – జితేంద్ర సాయి లను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు, శ్రీ సోమేపల్లి వెంకటసుబ్బయ్య గారు.
Author: chilakaluripetalocalnews@gmail.com
నరసరావుపేట పట్టణంలోని జమీందార్ ఫంక్షన్ హాల్ నందు వంకాయలపాటి సుధాకర్ రావు కుమారుని వివాహ రిసెప్షన్ వేడుక జరుగుచుండగా ఆ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు వినయ్ – స్రవంతి లను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసిన శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్
రజిని నివాసానికి వచ్చిన వైస్సార్సీపీ సీనియర్ నేతలు మాజీ మంత్రి విడదల రజిని అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ ను ఖoడించిన వైస్సార్సీపీ నేతలు పేర్ని నాని, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, డైమండ్ బాబు,లేళ్ళ అప్పిరెడ్డి. చిలకలూరిపేట నివాసం లోమాజీ మంత్రి రజినిని పరమ్మర్సించిన నేతలు
న్యూ షావోలిన్ కుంగ్ ఫు అకాడమి వారు కుంగ్ ఫు ఊషు ఫ్రీ సమ్మర్ కోచింగ్ చిలకలూరిపేట సి.ఆర్ క్లబ్ నందు నడుపబడుతున్న న్యూ షావోలిన్ కుంగ్ ఫు అకాడమి గత 9 సం.లుగా ఎంతోమంది విద్యార్ధిని, విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్ ఉచితముగా శిక్షణ ఇస్తూ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో విజయకేతనం ఎగుర విషయం అందరికి విధితమే. అందులో భాగంగా ఈ సమ్మర్ శెలవుల్లో విద్యా మానసిక, శారీరక ధృఢత్వమునకు తోడ్పడే విధంగా మార్షల్ ఆర్ట్స్ మరియు డిఫెన్స్లో ఫ్రీ సమ్మర్ కోచింగ్ క్యాంపును చిలకలూరిపేట సి. ఆర్ క్లబ్ నందు నిర్వహిస్తునా సమ్మర్ కోచింగ్ క్యాంప్ బ్రోచర్ని చిలకలూరిపేట మునిసిపల్ కమీషనర్ శ్రీ పి.శ్రీహరి గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగినది. తదుపరి ఈ నెల 12,13,14న కర్నూల్ జిల్లాలో ప్రభుత్వంచే గుర్తించబడిన ఊషు క్రీడా పోటీలలో న్యూ షావోలిన్ కుం అకాడమీ నుండి సబ్ జూనియర్,…
మాజీమంత్రి విడుదల రజిని వాహనంలోపోలీసు కేసుల్లో ముద్దాయి .మానుకోండ వారి పాలెం శ్రీకాంత్ రెడ్డి ముద్దాయిని కాపాడటం కోసం పోలీస్ విధుల్ని అడ్డుకున్న మాజీ మంత్రి అయినా వెనకాడకుండా తన యొక్క విధినిర్వహణాన్ని సక్రమంగా నిర్వహించి ముద్దాయిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించిన చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బానాయుడు
12 న పెద్ద రథం తిరునాళ్ల…. తిరుణాల జయప్రదం చేయాలని కోరుతున్న జనసేన నాయకులు మండలనేని చరణ్ తేజ చిలకలూరిపేట లక్ష్మీ నరసింహ స్వామి పెద్ద రథం తిరుణాల భక్తుల కొంగుబంగారంపల్నాడు జిల్లాలో చిలకలూరిపేట ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది. ఇక్కడ కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామిఎంతోమహిమాన్వితుడుగా భక్తుల నమ్మకాన్ని పొందాడు. ప్రతి సంవత్సరం స్వామివారికి జరిగే తిరుణాల ఎంతో వైభవంగా జరుగుతుంది. ఈ సంవత్సరం, మే12/06/2025 తేదీ సోమవారం సాయంత్రం 5:30 ని||లకు జరిగే పెద్ద రథం తిరుణాల మరింత ప్రత్యేకమైనది.శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి తిరుణాల ఒక గొప్ప ఆధ్యాత్మిక వేడుక. ఈ తిరుణాలకు మతాలకతీతంగా చుట్టుపక్కల గ్రామాల నుండి కాకుండా, రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు తరలివస్తారు. స్వామివారిని దర్శించుకోవడం, రథం లాగడంలో పాల్గొనడం ఒక గొప్ప అనుభూతిగా భావిస్తారు. భక్తులు తమ మొక్కుబడులు చెల్లించుకుంటారు, స్వామివారి ఆశీస్సులు పొందుతారు. ఈ తిరుణాల ఒక పండుగ…
చిలకలూరిపేట పట్టణంలోని ఎస్ఎంఎస్ షాది ఖానా వెనుక వైపున ఉన్న ఈనాడు ఉమర్ లేఔట్ నందు మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర నాయకులు మాదాసు భాను ప్రసాద్ అన్నారు.గతంలో పాదాచారులు దాహం వేస్తే ఇళ్లల్లో మంచినీరు అడిగి త్రాగే వారిని నేడు మారుతున్న పరిస్థితుల్లో అటువంటి అవకాశం లేకుండా పోయిందని అన్నారు. మంచినీటి చలివేంద్రాలు అందుబాటులో ఉండటంవల్ల ఎంతోమంది బయట ప్రాంతాల నుంచి వచ్చే వారికి, పరిసర ప్రాంతాలలో పనుల కోసం వచ్చిన వారికి ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈనాడు ఉమర్ లేఅవుట్ నందు మంచినీటి చలివేంద్రం క్రమం తప్పకుండా ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట లైసెన్సుడు ఇంజనీర్స్ అండ్ సర్వేయర్స్ అధ్యక్షులు డేవిడ్, ఉపాధ్యక్షులు శ్యామ్, శ్రీనివాస్, ఫిరోజ్, సాయి, ఈనాడు ఉమర్ కుటుంబ సభ్యులు మరియు సాదిక్, బాజీ తదితరులు పాల్గొన్నారు..
విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి నాదెండ్ల మండల కేంద్రమైన కనపర్రు గ్రామంలో కరెంటు షాకు తగిలి వ్యక్తి మృతి గ్రామానికి చెందిన మొగిలి రమేష్ మరియు ఆయన భార్య విజయలక్ష్మి శుక్రవారం వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన అనంతరం ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయగా కరెంట్ షాక్ తగిలి కిందపడ్డాడు. గమనించిన స్థానికులు చిలకలూరిపేట లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అప్పటికే రమేష్ మృతి చెందాడు. ఇతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి గ్రామంలో MSME పార్క్‌ను శంకుస్థాపన చేసిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మరియు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీజీవి ఆంజనేయులు గారు జిడిసిసి బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు గారు మరియు వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ కొంజేటి నాగ శ్రీను రాయల్ గారు ఈ పార్క్ ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ఆయన అన్నారు. ఈ పార్క్ ప్రాంత ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మరియు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
వినుకొండ మండలం తిమ్మాయిపాలెం గ్రామంలోని రంగనాయక స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన. ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీజీవి ఆంజనేయులు గారు ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు గారు స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.