ప్రముఖ నటుడు, సేవావేత్త సోనూసూద్ ని కలిసిన మాజీమంత్రి ప్రత్తిపాటి
- ప్రత్తిపాటి ఫౌండేషన్ సేవాకార్యక్రమాలు సోనూసూద్ కి వివరించి చిలకలూరిపేటకు ఆహ్వానించిన ఎమ్మెల్యే
నటనతోనే కాకుండా సేవా కార్యక్రమాలతోనూ నటుడు సోనూసూద్ ప్రజల మనసుల్లో నిలిచారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. శనివారం హైదరాబాద్ లోని ట్రైడెంట్ హోటల్లో మాజీమంత్రి నటుడు సోనూసూద్ తో మర్యాదపూర్వకంగా సమావేశమై సేవా కార్యక్రమాలపై మాట్లాడారు.
ప్రత్తిపాటి ఫౌండేషన్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్ని ఎమ్మెల్యే ప్రత్తిపాటి సోనూసూద్ కి వివరించారు. తాజాగా చిలకలూరిపేట పట్టణంలో ప్రత్తిపాటి ఫౌండేషన్ నిర్వహించిన ఉచిత నేత్రవైద్య శిబిరం గురించి సోనూసూద్ కి ప్రత్తిపాటి తెలియచేశారు. వేలమందికి నేత్రవైద్యసేవలు అందించడంపై సోనూసూద్ సంతోషం వ్యక్తంచేసి, ప్రత్తిపాటిని అభినందించారు. ప్రత్తిపాటి ఫౌండేషన్ ఎప్పుడు స్థాపించింది.. ఇన్నేళ్లలో ఏ రకమైన కార్యక్రమాలు చేపట్టి, ప్రజలకు ఏ విధమైన సేవలు అందించిందనే వివరాల్ని ప్రత్తిపాటి ప్రజంటేషన్ ద్వారా సోనూసూద్ కి వివరించారు.