శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ పున: నిర్మాణ పనులను ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి

వినుకొండ కొండపై వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, ఘాట్ రోడ్డు పున:నిర్మాణ పనులను ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు శనివారం ప్రారంభించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బాలాలయం వద్ద ఏర్పాటుచేసిన శ్రీ లక్ష్మీ గణపతి హోమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, ఘాట్ రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి, చారిత్రాత్మక చరిత్ర కలిగిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది పర్యాటక ప్రాంతంగా చేసి భక్తుల ఆకాంక్షను నెరవేరుస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిడిసిసి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు , కూటమి నాయకులు, కౌన్సిలర్లు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply