రామచంద్ర స్వామి వార్ల ప్రతిష్ఠా మహోత్సవంలో జీవి ఆంజనేయులుపాల్గొన్నారు.

వినుకొండ నియోజకవర్గం, నూజెండ్ల మండలం, యోగిరెడ్డిపాలెం గ్రామo లో శ్రీసీతారామలక్ష్మణ హనుమత్ సమేత రామచంద్ర స్వామి వార్ల ప్రతిష్ఠా మహోత్సవంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారు పాల్గొన్నారు. జీవి గారు మాట్లాడుతూ, యోగిరెడ్డిపాలెం గ్రామంలో దేవాలయ నిర్మాణం మరియు విగ్రహ ప్రతిష్ఠాపన గ్రామస్తుల భక్తికి, ఐక్యతకు నిదర్శనమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు.తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Share.
Leave A Reply