మున్సిపల్ చైర్మన్ రఫాని అధ్యక్షత న జరిగిన కౌన్సిల్ సమావేశం
హాజరైన 38 వార్డుల కౌన్సిలర్ లు… పలు అంశాలపై కొనసాగుతున్న చర్చ
కౌన్సిలర్ లకు గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించిన కౌన్సిలర్లు , అధికారులు తీరుపై ఆగ్రహం
సమావేశం ప్రారంభం గాక ముందే….7వ వార్డ్ కౌన్సిలర్ పార్వతి మాట్లాడుతూ వార్డ్ లో ఒక రోడ్ వేయాలని గత మూడు నెలలు నుంచి అడుగుతున్నా…ఇంత వరకు ఆ పని చేయలేదని ఆరోపించారు. ఈ విషయం పై DE రహీం సమాధానమిచ్చారు.
రోడ్ నిర్మాణానికి టెండర్లు పిలవడం జరిగిందని పేర్కొనగా,,, చైర్మన్ రఫాని కలగజేసుకొని ఏప్రిల్ నెలలో పనులు ఏమైనా చేశారా… లేదా అని అధికారులు ను ప్రశ్నించారు… DE రహీం …ఏప్రిల్ నెలలో పనులు చేశామని తెలపడంతో… మరీ ఆ పనులు చేసి నప్పుడు… కౌన్సిలర్ పార్వతి చెప్పిన పని ఎందుకు చేయలేదు అని చైర్మన్ మండిపడ్డారు.
ఆ తదుపరి ఏజండాలోని అంశాలను సిబ్బంది చదివి వినిపించారు.
52ఎకరాల్లో ఫ్యాన్లు పంపిణీ పై కౌన్సిల్ అధికారులు తీరు పై ప్రశ్నించిన కౌన్సిలర్ లు…. టిడ్కో గృహాలు అందరికి సంబంధించిన విషియమని…. కనీసం సమాచారం లేకుండా ఫ్యాన్లు పంపిణీ చేయడం ఏంటని కౌన్సిలర్ లు మండిపడ్డారు..
ఈ విశియం పై కమిషనర్ సమాధానం ఇచ్చారు…. ఫ్యాన్లు పంపిణీ విషియం తనకు తెలియదన్నారు. కౌన్సిలర్ లకు గౌరవం ఇవ్వడం లేదని అధికారులు తీరు పై కౌన్సిలర్ లు అందరూ అసంతృప్తి గా ఉన్నారు.
మరొక్కమారు ఇలా జరగకుండా చూస్తామని కమిషనర్ శ్రీహరి సభ ముఖంగా తెలిపారు.