పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి అనుమతి తో పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేసిన పల్నాడు జిల్లా జనతా వారధి కన్వినర్ మల్లెల శివ నాగేశ్వరావు

బిగ్ బాస్ ని అరెస్ట్ చేయండి

ఆంధ్రప్రదేశ్‌లో 2019-2024 వైసీపీ పాలనలో జరిగిన లిక్కర్ స్కామ్ విషయంలో భారతీయ జనతా పార్టీ అధికారుల రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయం కోరుకుంటోంది.

విషయం: 2019-2024 లిక్కర్ పాలసీలో భారీ ఆర్థిక కుంభకోణం – ‘బిగ్ బాస్’ (గత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి)ని అరెస్టు చేసి పూర్తి దర్యాప్తు చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్

భారతీయ జనతా పార్టీ ‘ జనతా వారధి ‘ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, వార్డుల్లో పర్యటించినప్పుడు ప్రజలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ కాలంలో లిక్కర్ పాలసీలో జరిగిన భారీ అవకతవకల గురించి వెల్లడి చేశారు. మద్యం విక్రయాలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకుని, అనుకూల కంపెనీలకు మాత్రమే అనుమతులు ఇచ్చి, నాణ్యత లేని కల్తీ మద్యాన్ని ప్రోత్సహించారు. దీనివల్ల వేలాది కుటుంబాలు నాశనం అయ్యాయి, యువత భవిష్యత్తు చీకటిలో మునిగింది, లివర్ సంబంధిత మరణాలు పెరిగాయి.

ఎక్సైజ్ ఆదాయం 2019-20లో ₹17,000 కోట్లకు పైగా ఉండగా, 2022-23కి ₹23,000 కోట్లు, 2024-25లో ₹28,000 కోట్లకు చేరింది. ఈ వ్యత్యాసం మొత్తం ఎక్కడికి వెళ్ళింది.

అంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) ద్వారా మొత్తం కొనుగోళ్లు, సరఫరా, విక్రయాలు కేంద్రీకరించి, ఔట్‌సోర్సింగ్ పేరుతో అనుకూలులను నియమించి అవినీతి చేశారు. నగదు అమ్మకాలు, డిజిటల్ లావాదేవీలు నివారించి బ్లాక్ మనీ మల్లించారు. అధికారం ఉపయోగించి డిస్టిల్లరీలు స్వాదీనం చేసుకుని NDP రా మెటీరియల్ కొనుగోలు చేసి సొంత బ్రాండ్లు తయారు చేసి అమ్మారు.

స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) దాఖలు చేసిన 305 పేజీల ఛార్జ్ షీట్‌లో ₹3,200-3,500 కోట్ల కుంభకోణంలో ‘బిగ్ బాస్’ (జగన్ రెడ్డి) పాత్ర కీలకమని, 90% బిగ్ బాస్ కి చేరాయని అంటే సుమారు ₹2970 కోట్లు బిగ్ బాస్ కు అందాయని, ప్రతి నెల ₹50-60 కోట్ల ముడుపులు వారికి చేరాయని స్పష్టం. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పల పాత్రలు కాల్ డేటా, గూగుల్ టేక్‌ అవుట్‌ల ద్వారా రుజువైంది. విజయవాడ ACB కోర్టు ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఆమోదం తెలిపింది. (GO 111, 126 మేరకు) 48 మంది పై కేసులు, 16 అరెస్టులు జరిగాయి, ₹62.86 కోట్ల ఆస్తులు సీజ్ చేశారు. ఇది అతిపెద్ద లిక్కర్ ఆర్ధిక కుంభకోణం వేల కోట్ల రూపాయల అవినీతి చేసి నేరుగా వారి జేబుల్లోకి డబ్బు చేరింది. అతి తక్కువ ఆస్తులు సీజ్ చేయడం వలన నిందితులకు వచ్చిన నష్టం ఏమి లేదు.

పై అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని,

నిందితులు చెప్పిన బిగ్ బాస్ ని అరెస్ట్ చేసి 2019-2024 లిక్కర్ పాలసీ పై మరింత విచారణ ఆదేశించాలి. చేసిన అవినీతికి తగిన ఆస్తులు గుర్తించి సీజ్ చేయాలి. పూర్తి వైట్ పేపర్ విడుదల చేయాలి – అమ్మకాలు, టర్నోవర్, టాక్స్,డిస్టిల్లరీ ఒప్పందాల వివరాలు ప్రజలకు తెలియాలి.

ముందుగా అసలు సూత్రాధికారి ‘బిగ్ బాస్’ని అరెస్టు చేసి విచారించాలి.

ప్రజల డబ్బుకు జవాబుదారీతనం ఉండాలి. నిజం బయటకు రావాలి. మీరు తక్షణ చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నది.

Share.
Leave A Reply