Author: chilakaluripetalocalnews@gmail.com

జనసేన ఆధ్వర్యంలో పట్టణంలో 26వ వార్డులో వృద్ధురాలికి చేయూత చిలకలూరిపేట 26వ వార్డులోని తిరుపతమ్మ గుడిలో సేవ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఒక వృద్ధురాలి కుటుంబానికి జనసేన పార్టీ అండగా నిలిచింది. చరణ్ తేజ పేరు మీద తమ సొంత నిధులతో జనసేన నాయకులు బియ్యం, నిత్యావసర వస్తువులు, మరియు ఆర్థిక సహాయం అందజేశారు. జనసేన యువనాయకులు మండల నేనిచరణ్ తేజ పేరు మీద చేపట్టిన రెండో సేవా కార్యక్రమం అని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో 26వ వార్డు జనసేన నాయకులు పీఎస్ఆర్, మీసాల రాజు, మీసాల లక్ష్మణ్, ఉపేంద్ర, బొంతు రామారావు, సంతు తదితరులు పాల్గొన్నారు. జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Read More

యోగాంధ్ర‌తో ప్ర‌పంచ రికార్డుయోగ ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో భాగం కావాలియోగ దినోత్స‌వంలో ప్ర‌తి ఒక్క‌రూ భాగ‌స్వాములు కావాలిజ‌న‌సేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-క‌న్వీన‌ర్ పెంటేల బాలాజిచిల‌క‌లూరిపేట‌:యోగాతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని.. సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని జన‌సేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-క‌న్వీన‌ర్ పెంటేల బాలాజి అన్నారు. గురువారం ఆయ‌న కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో బాలాజి మాట్లాడుతూ కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌జారోగ్యానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంద‌ని వివ‌రించారు. ఇందులో భాగంగానే ఈనెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్నివిశాఖపట్నం కేంద్రంగా,రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నార‌ని, యోగాంధ్ర కార్యక్రమం ద్వారా పలు ప్రపంచ రికార్డులు సాధించడం తోపాటు ఏపీని దేశంలో మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నార‌ని వెల్ల‌డించారు. ఈ కార్య‌క్ర‌మంలో దేశ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ కూడా పాల్గొన‌టం విశేష‌మ‌న్నారు.యోగ‌సాధ‌న‌తో గిన్నిస్ రికార్డు..జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని బాలాజి చెప్పారు.ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగస్వామ్యం కావాలని పేర్కొన్నారు.…

Read More

వినియోగదారుల హక్కుల పోస్టర్ ను ఆవిష్కరించిన తహసిల్దార్ షేక్ మొహమ్మద్ హుస్సేన్ వినియోగ దారుల హక్కుల పరిరక్షణ ఫోరం ఆధ్వర్యంలో గురువారం తాసిల్దార్ షేక్ మహమ్మద్ హుస్సేన్ ను సంఘ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశా రు . ఈ సందర్భంగావినియోగదారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై తాసిల్దార్ తో చర్చించారు . వినియోగదారుల జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ మురికిపూడి ప్రసాద్ మాట్లాడుతూ గ్యాస్ డెలివరీ ఛార్జీలు, గ్యాస్ సిలిండర్లు డెలివరీ లోపాలు, పెట్రోల్ బంకులలో వినియోగదారులకుజరుగుతున్న సౌకర్య లోపాలు తదితర అంశాలపై తహసిల్దార్ తో విపులంగా చర్చించి నట్లు తెలిపారు .. సమస్యలను పరిష్కరించాలని తాసిల్దార్ ను కోరడం జరిగిందని, తాసిల్దార్ సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు… అనంతరం వినియోగదారుల హక్కుల పోస్టర్ ను తహసీల్దార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి రవి నాయక్ కోశాధికారి బేబీ విక్రమ్, కార్యదర్శి పోలయ్య తదితర నాయకులు…

Read More

పల్నాడు పర్యటనలో ఆంక్షలు ఉల్లంఘన .. ఎస్పీ కీలక వ్యాఖ్యలు జగన్ పల్నాడు పర్యటనలో నిబంధనలు ఉల్లంఘనలు నిబంధనల ఉల్లంఘనలపై కీలక వ్యాఖ్యలు చేసిన పల్నాడు ఎస్పీ లీగల్ ఒపీనియన్ తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడి వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో నిన్న పర్యటించిన విషయం విదితమే. జగన్ పర్యటనలో వైసీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించాయి. బైక్ ర్యాలీ నిర్వహించడంతో పాటు అనుచిత వ్యాఖ్యలతో కూడిన పోస్టర్లను ప్రదర్శించాయి. పోలీస్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పర్యటన సాగింది. జగన్ జిల్లా పర్యటనపై పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ పల్నాడు పర్యటనకు ఆంక్షలతో కూడిన అనుమతులు ఇవ్వగా, ఆంక్షలకు పూర్తి విరుద్ధంగా కార్యక్రమం జరిగిందని ఎస్పీ తెలిపారు. పోలీసులపై ప్రజా ప్రతినిధులు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని అన్నారు. ట్రాఫిక్ సమస్యలు కూడా తీవ్రంగా ఏర్పడ్డాయని,…

Read More

పోగొట్టుకున్న 11 సెల్ ఫోన్‌ల రికవరీ, బాధితులకు అందించిన : అర్బన్ సిఐ రమేష్ చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో పోగొట్టుకున్న 11 సెల్ ఫోన్‌లను పేట అర్బన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది విజయవంతంగా రికవరీ చేశారు. ఈరోజు, పేట అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పి. రమేష్ రికవరీ చేయబడిన ఈ సెల్ ఫోన్‌లను వాటిని పోగొట్టుకున్న బాధితులకు అప్పగించారు.ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ రమేష్ మాట్లాడుతూ, సెల్ ఫోన్‌లు పోగొట్టుకున్న వెంటనే బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం వల్ల వాటిని తిరిగి పొందడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. సైబర్ క్రైమ్ మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ ఫోన్‌లను గుర్తించడం జరిగిందని, ప్రజలు తమ వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.పోగొట్టుకున్న తమ సెల్ ఫోన్‌లను తిరిగి పొందిన బాధితులు పోలీస్ అధికారులకు, ముఖ్యంగా ఇన్‌స్పెక్టర్ రమేష్ కి మరియు వారి బృందానికి తమ…

Read More

చిలకలూరిపేట భాష్యం స్కూల్ లో ఘనంగా ముందస్తు యోగ దినోత్సవం వివిధ రకాల ఆసనాలు వేసిన చిన్నారులు రాష్ట్ర వ్యాప్తంగా యోగ ను ఒక ఉత్సవంలా నిర్వహిస్తున్న భాష్యం విద్యా సంస్థలు అవగాహన కల్పించిన ZEO హృదయ రాజ్, ZCO ప్రమీల రాణి,ప్రిన్సిపాల్ సునీల్ మూడు రోజుల పాటు పాటశాల లో జరగనున్న యోగ ప్రక్రియ యోగా చేయడం వల్ల విద్యార్థులలో మానసిక ఉల్లాసం,ప్రశాంతత ,లభిస్తుందని చిలకలూరిపేట భాష్యం స్కూల్ ప్రిన్సిపాల్ నరసరావుపేట భాష్యం స్కూల్స్ జోన్ ZCO అంచా ప్రమీల రాణి తెలిపారు. గురువారం ఉదయం చిలకలూరిపేట భాష్యం స్కూల్ ఆధ్వర్యంలో భాష్యం గ్రౌండ్ నందు విద్యార్థులు, చిన్నారులు యోగ చేశారు. ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా ముందస్తు గా భాష్యం స్కూల్ విద్యార్థులు యోగ చేసి యోగ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి వివరించారు. ఈ సందర్భంగా ZEO హృదయ రాజ్ ,ZCO అంచా ప్రమీల రాణి…

Read More

యోగా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా”చదలవాడ_ _నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో యోగా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నరసరావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు డా”చదలవాడ అరవింద బాబు పాల్గొని యోగా చేసారు ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగాను నిత్య జీవితంలో అంతర్భాగం చేసుకోవాలని ఉద్దేశంతో యోగా ప్రాధాన్యతను ప్రపంచానికి తెలియజేసేలా దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ నెల 21 వ తేదీన వైజాగ్ మహానగరంలో యోగాంద్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Read More

జగన్ ఉన్మాద ప్రవృత్తికి నిదర్శనమే ఈ రోజు పల్నాడు పర్యటన : ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు పోలీసులు 100 మందికి అనుమతిస్తే వేలాది మందిని సమీకరించి బలప్రదర్శన చేశారు. ఇద్దరు అమాయకుల మరణం జగన్, వైకాపా బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. జగన్ ఒకరిని పరామర్శించడానికి వచ్చి మరో ఇద్దరి మరణానికి కారణమయ్యాడు. జగన్ కారణంగా నష్టపోయిన వ్యక్తి మరణాన్ని తెదేపాకు ఆపాదించాలని చూడడమే దారుణం. జరిగిన విషాదంపై జగన్, వైకాపా స్పందించకుండా పర్యటన కొనసాగించడం మరో దుర్మార్గం. పల్నాడు జిల్లాలో చిచ్చురేపడం కోసమే వైకాపా, జగన్ రెచ్చగొట్టే రాజకీయాలు. వైకాపా ఐదేళ్ల పాలనలో రాజకీయహింసను ప్రోత్సహించారు.. మళ్లీ అదే చేస్తున్నారు. ఇద్దరి మృతికి కారణమైన ఘటనలో బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

Read More

పల్నాడు జిల్లా, అమరావతిలో కృష్ణానది ఒడ్డున, ధ్యాన బుద్ధ ప్రాంగణంలో యోగాంధ్ర కార్యక్రమం విజయవంతంగా జరిగింది.. వేలాదిమంది యోగా సాధకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.. కార్యక్రమంలో పలనాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు గారు, రాష్ట్ర ఎంపీపీల సంఘం అధ్యక్షులు అమరావతి ఎంపీపీ మేకల హనుమంతరావు గారు, DRDA PD గారు, DWAMA PD గారు, DEO గారు, RDO గారు , DPO గారు, DLPO గారు, పర్యాటక శాఖ అధికారులు, మండల తహసిల్దార్ డానియల్ గారు, ఎంపీడీవో పార్వతి గారు, పలువురు జిల్లా మరియు మండల స్థాయి అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, వెలుగు సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, మెడికల్ సిబ్బంది, విద్యార్థులు మరియు పలువురు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.. ఎంపీపీ హనుమంతరావు గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో యోగాను అంతర్భాగం చేసుకుని ఆరోగ్యవంతమైన జీవనాన్ని కొనసాగించాలన్నదే నరేంద్ర మోడీ…

Read More

అవినీతి చేసింది ఒకరు..నగదు చెల్లించింది ఉద్యోగులు మున్సిపల్ ఖజానాకు డబ్బులు చెల్లించిన ఉద్యోగులు చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అవినీతి కుంభకోణం ఔట్ సోర్సింగ్ ఉద్యోగి గంగా భవాని చేసిన అవినీతి కి బలైన 15మంది పెర్మినెంట్ ఉద్యోగులు ఈ అవినీతి కుంభకోణం లో 34లక్షల రూపాయల ప్రజల సొమ్ము ను కాజేసిన ఉద్యోగి గంగా భవాని ఈ 34లక్షల రూపాయల లో గతంలో 12లక్షల రూపాయలు ను కట్టించగా….మిగిలిన 21లక్షల 40 వేల రూపాయలు ను సస్పెండ్ అయిన ఉద్యోగులు మున్సిపల్ ఖజానాకు చెల్లించారు. అయితే అవినీతి చేసిన గంగా భవాని కోసం పోలీసులు వెతుకుతున్నారు. నగదు చెల్లింపు లు చేశారు కాబట్టి వీరిపై సస్పెండ్ ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయని పలువు

Read More