భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మద్ది నగర్ వద్దగల వడ్డెర కాలనీలో గణనాధునికి పూజలు నిర్వహించారు
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి స్ఫూర్తితో అలాగే పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఏలూరు శశి కుమార్ గారి ఆదేశాల మేరకు చిలకలూరిపేట మున్సిపల్ ఏరియా లో ఉన్న స్లమ్ ఏరియాలను సందర్శించి వార్డుల్లో ఉన్న సమస్యలు గురించి తెలుసుకోవటానికి ఈరోజు ఆదివారం ఉదయం 11 గంటలకు వడ్డెర కాలనీ సందర్శించడం జరిగింది.
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మద్దినగర వద్ద గల వడ్డెర కాలనీలో ఏర్పాటుచేసిన గణనాధునికి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులకు కాలనీవాసులు ఘనస్వాగతం పలికి పల్నాడు జిల్లా కార్యదర్శి గట్టా హేమ్ కుమార్ కు దుశ్యాలవ తో సత్కరించడం జరిగింది. తదుపరి కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన సృజలా స్రవంతి వాటర్ ప్లాంట్ ను సందర్శించడం జరిగింది. గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లో మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే విడుదల రజిని కుతంత్ర రాజకీయాలకు కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు చేసినందువలన వాటర్ ప్లాంట్ ని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం హయాంలో ముసివేయడం జరిగింది. సదరు ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ కు ఫోన్ చేసి మాట్లాడగా వెంటనే తగు చర్యలు తీసుకుని వాటర్ వచ్చేలాగా ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా కార్యదర్శి గట్టా హేమ్ కుమార్ పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నెల్లూరు ఈశ్వర్ రంజిత్ బిజెపి యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పులిగుజ్జు మహేష్ పల్నాడు జిల్లా మీడియా ఇన్ఛార్జ్ వంకాయలపాటి వంశీ బీజేపీ నాయకులు పల్లపు శివయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



