Author: chilakaluripetalocalnews@gmail.com

వీధి నాటకము ద్వారా హెచ్ఐవి/ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం చిలకలూరిపేట : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశముల మేరకు జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ పల్నాడు జిల్లా వారి సహకారం తో స్థానిక క్యాంప్ స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 20 వ తారీకు సాయంత్రం 5 గంటలకు చిలకలూరిపేట లోని కళామందిర్ సెంటర్ నందు కళాజాతర బృందాలతో వీధినాటకముల ద్వార హెచ్ఐవి/ఎయిడ్స్ పై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ వీధి నాటకములు ద్వారా హెచ్ఐవి/ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, ఎలా వ్యాపించదు, రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్ఐవి/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్న చూపు లేకుండా ఎలాగా సమాజంలో కలిసి జీవించాలి, హెచ్ఐవి/ఎయిడ్స్ -క్షయ వ్యాధి సంబంధం గురించి, సుఖవ్యాధులు మరియు చికిత్స గురించి, కండోమ్ యొక్క ఉపయోగం గురించి, హెచ్ఐవి/ఎయిడ్స్ ఆక్ట్ 2017 గురించి ప్రజలలో అవగాహనా కల్పించారు. సిహెచ్…

Read More

చిలకలూరిపేట ఏఐటియుసి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చిలకలూరిపేట : కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా మంగళవారం ఉదయం చిలకలూరిపేట పట్టణంలోని ఎన్నార్టీ సెంటర్ సిపిఐ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగినది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె వాయిదా పడిన నేపథ్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చిలకలూరిపేట నియోజకవర్గ ఏఐటియుసి అధ్యక్షులు పేలురి రామారావు తెలిపారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ కార్మిక , కర్షకులకు నడ్డి విరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేయాలని తెలిపారు. కార్మికులకు కార్మిక శాఖ ద్వారా సభ్యత్వాలను నమోదు చేసి సంక్షేమ పథకాలను అమలు చేయాలని తెలిపారు. నిరసన…

Read More

చిలకలూరిపేట నియోజకవర్గం, యడ్లపాడు మండలం, జాలాది గ్రామంలో పాస్టర్ కూరాకుల సుధాకర్, పాస్టర్ కూరాకుల రాజేష్ గార్ల ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన హెబ్రోను ప్రార్థన మందిరాన్ని ప్రారంభించి, అనంతరం ప్రార్ధన మందిర కమిటీ వారు ఏర్పాటు చేసిన ప్రార్ధనల్లో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కన్వీనర్ తోట రాజరమేష్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా గారు, నెల్లూరి సదాశివరావు గారు, జవ్వాజి మదన్ గారు, కామినేని సాయిబాబా గారు, కందిమళ్ళ రఘురామరావు గారు, పోపూరి వెంకయ్య గారు, పోపూరి శ్రీనివాసరావు గారు, పుటిగంటి వెంకటేశ్వరరావు గారు మరియు మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు…

Read More

టీడీపీ ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమం ఈ ఏడాది పండుగ వాతావరణం లో, గతంలో ఎన్నడూ జరుగని విధంగా, కనివిని ఎరుగని రీతిలో మహానాడు నిర్వహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ మేరకు మహానాడు కు సంబంధించి కమిటీ లు నియమించారు. జనసమీకరణ కమిటీ లో19మందిని నియమిస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ19మంది లో చిలకలూరిపేట శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ను నియమించారు. మహానాడు పండుగ కు లక్షల లో జనసమికరణ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఈ పని ని ఎమ్మెల్యే ప్రత్తిపాటి కి అప్పగించారు. దీంతో చిలకలూరిపేట నియోజకవర్గ టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.

Read More

పిడుగుపాటు మృతురాలి కుటుంబానికి ఆర్థికసాయం అందజేసిన ప్రత్తిపాటి 50000ఆర్థిక సహాయ చెక్కును అందించిన ఎమ్మెల్యే పొలంపనులకు వెళ్లి పిడుగుపాటుతో మరణించిన షేక్ పర్వీన్ కుటుంబానికి ప్రభుత్వం అందచేసిన రూ.50వేల ఆర్థికసాయం చెక్కును మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు మంగళవారం అందచేశారు. యడ్లపాడు మండలం కారుచోల గ్రామానికి చెందిన షేక్ పర్వీన్ ఈ నెల 14వ తేదీన కూలిపనులకు వెళ్లినప్పుడు పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె మరణ వార్త తెలిసిన వెంటనే మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పిన ప్రత్తిపాటి, తాజాగా ఆమె భర్త జాన్ సైదాకు ఆర్డీవో మధులత సమక్షంలో రూ.50వేల చెక్కును అందచేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సాయం కూడా త్వరలోనే అందేలా చూస్తానని ప్రత్తిపాటి చెప్పారు. భార్య మృతితో అధైర్యపడకుండా పిల్లలను జాగ్రత్తగా చదివించి ప్రయోజకుల్ని చేయాలని ప్రత్తిపాటి సైదాకు సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కామినేని సాయిబాబు, కారుచోలా గ్రామా నాయకులు పాల్గొన్నారు.

Read More

జగన్ తప్పులు, పాపాలవల్లే పథకాల అమల్లో జాప్యం గత ప్రభుత్వం 5 ఏళ్లపాటు ఎక్కడా రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేదని, కూటమిప్రభుత్వం వచ్చాకే రాష్ట్రంలో రోడ్లనిర్మాణం వేగవంతమైందని, గ్రామాల్లో పొలాలకు వెళ్లే డొంకలు, చిన్న రోడ్లను కూడా బాగుచేస్తున్నారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గత ప్రభుత్వంలా పేదల్ని మాటలతో వంచించడం కూటమిప్రభుత్వం చేయదని, గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఇళ్లు నిర్మించుకున్నవారికి అందాల్సిన బకాయిలు కూడా త్వరలోనే అందుతా యని ప్రత్తిపాటి చెప్పారు. యడ్లపాడు మండలం జాలాదిలో రూ.10లక్షలతో నిర్మించిన డ్రైనేజ్ లను ప్రారంభించిన ప్రత్తిపాటి, అనంతరం జాలాది – కొప్పర్రు మధ్య 40 లక్షల రూపాయల నిధులతో వేయబోయే మెటల్ రోడ్డుకు శంఖుస్థాపన చేశారు

Read More

సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ కన్నా లక్ష్మి నారాయణ గారి ఆదేశానుసారం భారీ స్థాయిలో సత్తెనపల్లి నియోజకవర్గ మహానాడు కార్యక్రమం మహానాడుకు ముఖ్య అతిధులుగా విచ్చేసిన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ కొమ్మాలపాటి శ్రీధర్ గారుమరియు నియోజకవర్గ పరిశీలకులు తాతా జయప్రకాశ్ నారాయణ గారు తీవ్రవాదుల దాడిలో మరణించిన వీర సైనికులకు మరియు ఇటీవల మరణించిన తెలుగుదేశం పార్టీ నాయకుల ఆకస్మిక మరణానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మౌనం పాటించి నివాళులర్పించారు సత్తెనపల్లి నియోజవర్గానికి చెందిన 12 తీర్మానాలను ఆమోదించిన నాయకులు పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రివర్యులు స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారికి మరియు మాజీ శాసన సభ స్పీకర్ శ్రీ డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు *రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరింతగా అభివృద్ధి చెందాలంటే అందరూ కలిసి పని చేయాలన్న కొమ్మాలపాటి * అన్ని విధాలుగా…

Read More

చిలకలూరిపేట నియోజకవర్గం, యడ్లపాడు మండలం, జగ్గాపురం గ్రామానికి చెందిన పోపూరి సుధాకర్ గారి కుమారుడు పోపూరి వెంకటేష్ గారికి ఇటీవల యాక్సిడెంట్ అవ్వడంతో, ఈరోజు వారింటికి వెళ్లి వారిని పరామర్శించిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కన్వీనర్ తోట రాజరమేష్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా గారు, నెల్లూరి సదాశివరావు గారు, జవ్వాజి మదన్ గారు, కామినేని సాయిబాబా గారు, కందిమళ్ళ రఘురామరావు గారు, పోపూరి వెంకయ్య గారు, పోపూరి శ్రీనివాసరావు గారు, పుటిగంటి వెంకటేశ్వరరావు గారు, మరియు మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు…

Read More

శ్రీ అభయాంజనేయ స్వామియే నమః భక్త మహాశయులకు విజ్ఞప్తి మన పోలిరెడ్డి పాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సిద్ధిబుద్ధి సమేత విగ్నేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు ది 22 .5 .2025 అనగా గురువారము స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం పురస్కరించుకొని స్వామివారి హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి ఉదయము 8:30 నుండి పంచామృతాభిషేకములు జరుగును తదుపరి తీర్థ ప్రసాద వినియోగం జరుగును సాయంకాలము ఐదు గంటల నుండి కోలాట కార్యక్రమము జరుగును తదుపరి 7:30 నుండి స్వామి వారి యొక్క మహా అన్న ప్రసాద వితరణ జరుగును కావున భక్తులు స్వామి వారిని దర్శించుకుని స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము ఇట్లు శ్రీ అభయాంజనేయ స్వామి వారి…

Read More

నరసరావుపేట పట్టణంలోని ఆవులు సత్రం కొనిశెట్టి లక్ష్మయ్య బజారులో కారు బీభత్సం సృష్టించింది అతి వేగంగా ఇళ్లపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొని తర్వాత ఆటోను ఢీకొని ఇళ్లపైకి దూసుకు వచ్చిందని స్థానిక ప్రజలు తెలిపారు. ఓ మైనర్ బాలుడు కారును అదుపు చేయలేక వేగంగా ఇళ్ళ మీదకి దూసుకురావడంతో ప్రజలు భయాందోళన గురి చెందారు.

Read More