మహానాడు ఘన విజయం వెనుక ప్రత్తిపాటి హస్తం ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు
క్రమశిక్షణతో చేయి చేయి కలిపితేనే ఘనవిజయం సాధ్యం
చిలకలూరిపేట :జన సమీకరణలో భాగంగా రాజంపేట నియోజకవర్గం ఇన్చార్జిగా వ్యవహరించిన మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, ప్రతిపాటి పుల్లారావు రాజంపేట పార్లమెంట్ ఇంచార్జి అయిన చామర్తి జగన్మోహన్ రాజు తో కలిసి జన సమీకరణకు ఏర్పాట్లను పర్యవేక్షించారు
పర్యవేక్షణలో భాగంగా ప్రత్తిపాటి ఆదేశాలతో జి డి సి సి బ్యాంక్ మాజీ చైర్మన్ మానం వెంకటేశ్వర్లు నందలూరు మండలం, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహక కార్యదర్శి అయిన షేక్ కరిముల్లా రాజంపేట రూరల్ మండలం.
చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన ఐ టీడీపీ నాయకులు మారెళ్ళ అప్పారావు వీరబల్లి మండలం), లీగల్ సెల్ నాయకులు ఎమ్ వెంకటరావు సుండుపల్లి మండలం, చిలకలూరిపేట పట్టణ టీడీపీ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్.సిద్దవటం మండలం.సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మురుకొండ మల్లిబాబు రాజంపేట అర్బన్, క్లస్టర్ ఇంచార్జ్ అయిన ముల్లా కరీముల్లా ఒంటిమిట్ట మండలం మొత్తం ఎడుగురిని ఆరు మండలాలకు ఒక్కరిని అర్బన్ ఇంచార్జ్ లుగా నియమించి స్థానిక నాయకులను సమన్వయం చేసుకుంటూ ఒక్క రాజంపేట నియోజకవర్గం నుండే ముప్పై అయిదు వేలకు పైగా జన సమీకరణ చెయ్యడంలోప్రత్తిపాటి పుల్లారావు కృషి ఎనలేనిదనీ మహానాడు కు వెళ్ళిన టీడీపీ నాయకులు పేర్కొన్నారు
https://youtu.be/CldyK1hkT58?si=VT297pPm5abPnEe_



