నాఓటు – నాహక్కు”
పేరుతో నూతన ఉద్యమం ప్రారంభిస్తున్నట్లు నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు.ప్రజాస్వామ్యం ఓటు హక్కు అమ్మకంతో అపహాస్యం కాకూడదని భావించి మార్పుకోసం మరో మహోద్యమానికి నవతరం పార్టీ శ్రీకారం చుట్టిందని తెలిపారు.”ఇండియా అగైనెస్ట్ ఓట్ కరప్షన్”దిశగా ఉద్యమం నడిపిస్తామని,ఓటు హక్కును కొనుగోలు చేసే వస్తువుగా చూసే సంప్రదాయం మార్చేందుకు ప్రయత్నం చేయాలని నిర్ణయం తీసుకొని ఉద్యమం మొదలు పెట్టామని అన్నారు. ముందుగా విద్యార్థులు,యువకులకు ఓటు హక్కు అమ్మకం వల్ల జరుగుతున్న నష్టం వివరిస్తామని, వారి భాగస్వామ్యంతోనే ఉద్యమం ముందుకు తీసుకొని వెళతామని రావుసుబ్రహ్మణ్యం తెలిపారు.వచ్చే సార్వత్రిక ఎన్నికలు నాటికీ ఒక్క ఓటు కూడా అమ్మడం లేక కొనడానికి అవకాశం లేకుండా చేయడమే ఉద్యమం లక్ష్యం అని అన్నారు.ఓటుఅమ్మకం లేని నవ భారతావనిని సృష్టించడమే లక్ష్యం అన్నారు చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే మార్పు సాధ్యమే అన్నారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. నవతరం పార్టీ నుండి అందరి సహకారం ఆశిస్తున్నామన్నారు.
Trending
- కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ అభినందనలు
- చిలకలూరిపేటలో దేవాలయ నిర్మాణానికి ఆర్థిక సహాయం కోసం ఎమ్మెల్యేకు వినతి
- పల్నాడు జిల్లా జనతా వారిది కార్యక్రమం నరసరావుపేట జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది
- స్థానిక ఎన్నికల్లో సాధించే మంచి విజయమే… శ్రేణుల పనితీరుకు కొలమానం : ప్రత్తిపాటి
- చేనేత సహకార సంఘాల ప్రక్షాళన, పారదర్శక ఎన్నికలు, APCOలో ప్రజాస్వామ్య పాలన, నేతన్నల బకాయిల పరిష్కారం గురించి వినతి పత్రం సమర్పించడం జరిగింది
- పల్నాడు జిల్లా జనతా వారిది కార్యక్రమం నరసరావుపేట జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది
- కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ చిలకలూరిపేట నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా షేక్ జానీభాష నియామకం
- కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షుడిగా బాలు నాయక్



