వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టత కి కృషి చేయాలి: మాజీ మంత్రి విడదల రజిని

చిలకలూరిపేట :వైఎస్ఆర్సీపీ లో పదవులు పొందిన నాయకులు పార్టీ పటిష్టత కి కృషి చెయ్యాలని మాజీ మంత్రి విడదల రజిని సూచించారు.ఈ రోజు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా ఉపాదక్ష్యులుగా మరియు కార్యదర్శులు గా నియమితులైన మద్దూరి కోటిరెడ్డి , వలేటి వెంకటేశ్వరరావు ,జిల్లా అధికార ప్రతినిధులుగా నియమితులైన ఉడతా వెంకటేశ్వర రావు మరియు రాష్ట్ర ఐటీ విభాగ రీజినల్ కో ఆర్డినేటర్ నియమితులైన పాలూరి అంజిరెడ్డి
మాజీ మంత్రి విడదల రజిని ని వారి నివాసంలో కలసి వారు వివిధ హోదాల్లో నియామకంకావటానికిసహకరించినందుకు గాను కృతజ్ఞతలు తెలియచేశారు.
ఈ సందర్భంగా రజిని మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీ నమ్ముకొని కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారుమరియు జగనన్న హయంలో మనం ప్రజలకి చేసిన మేలు,ప్రజల పట్ల మనం చూపిన ప్రేమ నేడు ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం లో కరువయ్యాయని,మనం చేసిన మంచి ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని ప్రతి పేదవాడికి మనం చేసిన సంక్షేమం, చేసిన అభివృధి ఎప్పటికీ మర్చిపోరు కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు అని తెలిపారు.రాబోయే రోజుల్లో అందరం కష్టపడి పని చేసి జగన్ మోహన్ రెడ్డి గారిని తిరిగి ముఖ్యమంత్రి చెయ్యడమే లక్ష్యంగా ముందుకు సాగాలని కోరారు.ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share.
Leave A Reply