కమ్మవారిపాలెంలో రూ.15 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి గారు
వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం కమ్మవారిపాలెం గ్రామంలోని ST కాలనీలో రూ. 15 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారు శంకుస్థాపన చేశారు. చీఫ్ విప్ జీవి గారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి, ముఖ్యంగా నిరుపేదలు నివసించే కాలనీల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. కమ్మవారిపాలెం ST కాలనీలో నిధులు మంజూరు కావడంతో స్థానిక ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్ష నెరవేరిందని ఆయన అన్నారు. ఈ నిధులతో కాలనీలో మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని, ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు గారు స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.