శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ పున: నిర్మాణ పనులను ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి వినుకొండ కొండపై వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, ఘాట్ రోడ్డు పున:నిర్మాణ పనులను ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు శనివారం ప్రారంభించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బాలాలయం వద్ద ఏర్పాటుచేసిన శ్రీ లక్ష్మీ గణపతి హోమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, ఘాట్ రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి, చారిత్రాత్మక చరిత్ర కలిగిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది పర్యాటక ప్రాంతంగా చేసి భక్తుల ఆకాంక్షను నెరవేరుస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిడిసిసి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు , కూటమి నాయకులు, కౌన్సిలర్లు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Author: chilakaluripetalocalnews@gmail.com
సేవలో విద్యకే తొలిప్రాధాన్యత ఇన్నర్వీల్ క్లబ్ చిలకలూరిపేట అధ్యక్షురాలు గట్టు సరోజిని రవిశంకర్ ఆశ్రమ పాఠశాల అభివృద్ధికి రూ.10.20 లక్షల చెక్కు అందజేత యడ్లపాడు అనాథ బాలల విద్యాభ్యున్నతికి ఇన్నర్వీల్ క్లబ్ భారీ విరాళాన్ని అందించింది. యడ్లపాడు మండలం కొత్తపాలెం(పుట్టకోట) గ్రామంలో ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో ఆధ్మాత్మిక గురూజీ రవిశంకర్ ఆశ్రమ పాఠశాల(ఆర్ట్ ఆఫ్ లింగ్)కు రూ.10.20 చెక్కును శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట అధ్యక్షురాలు గట్టు సరోజిని మాట్లాడుతూ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టే సేవా కార్యక్రమాల్లో పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు ఉచిత విద్య, సౌకర్యాలను అందించడంలో ఇన్నర్వీల్ తొలిప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇందులో భాగంగానే మద్ది లక్ష్యయ్య గ్రూప్స్ కంపెనీ డైరెక్టర్ మద్ది వెంకటేశ్వరరావు, లలితమ్మ దంపతుల ఆర్ధిక సహకారంతో ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో రూ.10.20 లక్షల విరాళాన్ని అందజేసినట్లు తెలిపారు. ఈ నిధులతో…
కమ్మవారిపాలెంలో రూ.15 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి గారు వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం కమ్మవారిపాలెం గ్రామంలోని ST కాలనీలో రూ. 15 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారు శంకుస్థాపన చేశారు. చీఫ్ విప్ జీవి గారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి, ముఖ్యంగా నిరుపేదలు నివసించే కాలనీల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. కమ్మవారిపాలెం ST కాలనీలో నిధులు మంజూరు కావడంతో స్థానిక ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్ష నెరవేరిందని ఆయన అన్నారు. ఈ నిధులతో కాలనీలో మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని, ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు గారు స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
మహానాడు ఘన విజయం వెనుక ప్రత్తిపాటి హస్తం ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు క్రమశిక్షణతో చేయి చేయి కలిపితేనే ఘనవిజయం సాధ్యం చిలకలూరిపేట :జన సమీకరణలో భాగంగా రాజంపేట నియోజకవర్గం ఇన్చార్జిగా వ్యవహరించిన మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, ప్రతిపాటి పుల్లారావు రాజంపేట పార్లమెంట్ ఇంచార్జి అయిన చామర్తి జగన్మోహన్ రాజు తో కలిసి జన సమీకరణకు ఏర్పాట్లను పర్యవేక్షించారుపర్యవేక్షణలో భాగంగా ప్రత్తిపాటి ఆదేశాలతో జి డి సి సి బ్యాంక్ మాజీ చైర్మన్ మానం వెంకటేశ్వర్లు నందలూరు మండలం, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహక కార్యదర్శి అయిన షేక్ కరిముల్లా రాజంపేట రూరల్ మండలం.చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన ఐ టీడీపీ నాయకులు మారెళ్ళ అప్పారావు వీరబల్లి మండలం), లీగల్ సెల్ నాయకులు ఎమ్ వెంకటరావు సుండుపల్లి మండలం, చిలకలూరిపేట పట్టణ టీడీపీ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్.సిద్దవటం మండలం.సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మురుకొండ మల్లిబాబు రాజంపేట అర్బన్,…
చిలకలూరిపేట పట్టణంలోని, రామారావు మల్టిస్పెషలిటీ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న గోవిందపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుత్తా వెంకటేశ్వర్లు గారిని పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితులు గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా గారు, నెల్లూరి సదాశివరావు గారు, జవ్వాజి మదన్ గారు, అంబటి సోంబాబు గారు, గోపి గారు తదితరులు పాల్గొన్నారు..
చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హోమ్ గార్డ్ శ్రీనివాసరావు గారు మరియు అతని కుమారునికి ఇటీవల యాక్సిడెంట్ జరగగా, ఈ రోజు పండరిపురం లోని వారింటికి వెళ్లి, వారి ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకొని, వారిని పరామర్శించిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా గారు, నెల్లూరి సదాశివరావు గారు, జవ్వాజి మదన్ గారు, మద్దుమాల రవి గారు, రాయని శ్రీను గారు మరియు వార్డ్ నాయకులు పాల్గొన్నారు…
నాదెండ్ల మండలం కనపర్రు గ్రామ ఎస్సీ కాలనీ వాస్తవ్యులు గుడిపూడి వీరయ్య గారి కుమారుడు కామేశ్వరరావు గారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకొని వారి స్వగృహం వద్ద ఉన్న పార్థివ దేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు… ఈ కార్యక్రమంలో వారి వెంట గ్రామ సర్పంచ్ పెరుమాళ్ళపల్లి వెంకటేశ్వర్లు గారు,మాలే వెంకటస్వామి గారు, గాలి జయప్రకాష్ గారు, చట్టాల సాంబశివరావు గారు తదితరులున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టత కి కృషి చేయాలి: మాజీ మంత్రి విడదల రజిని చిలకలూరిపేట :వైఎస్ఆర్సీపీ లో పదవులు పొందిన నాయకులు పార్టీ పటిష్టత కి కృషి చెయ్యాలని మాజీ మంత్రి విడదల రజిని సూచించారు.ఈ రోజు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా ఉపాదక్ష్యులుగా మరియు కార్యదర్శులు గా నియమితులైన మద్దూరి కోటిరెడ్డి , వలేటి వెంకటేశ్వరరావు ,జిల్లా అధికార ప్రతినిధులుగా నియమితులైన ఉడతా వెంకటేశ్వర రావు మరియు రాష్ట్ర ఐటీ విభాగ రీజినల్ కో ఆర్డినేటర్ నియమితులైన పాలూరి అంజిరెడ్డిమాజీ మంత్రి విడదల రజిని ని వారి నివాసంలో కలసి వారు వివిధ హోదాల్లో నియామకంకావటానికిసహకరించినందుకు గాను కృతజ్ఞతలు తెలియచేశారు.ఈ సందర్భంగా రజిని మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీ నమ్ముకొని కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారుమరియు జగనన్న హయంలో మనం ప్రజలకి చేసిన మేలు,ప్రజల పట్ల మనం చూపిన…
కరోన టెస్టులకు సర్వం సిద్ధం ,కోవిడ్ ను ఎదుర్కొంటాం-ఆసుపత్రి ఇంచార్జి డాక్టర్ శ్రీనివాస్ చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కరోన వైద్యం అందుబాటులో ఉంది-ఇంచార్జి డాక్టర్ శ్రీనివాస్ ప్రస్తుతం కరోన కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు చిలకలూరిపేట100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకంగా వార్డ్,కోవిడ్ సెంటర్, పరీక్షలు చేసేందుకు రూమ్ లు ఏర్పాటు చేశామని ఆసుపత్రి ఇంచార్జి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల కు చెందిన వారు…. చుట్టూ ప్రక్కల గ్రామాల వారు ఎవరు వచ్చిన ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నామన్నారు కోవిడ్ వస్తే భయపడాల్సిన అవసరం లేదని, వైద్య పరీక్షలు జరిపి కోవిడ్ నిర్దారణ అయితే ప్రత్యేకంగా క్వారoటైన్ లో ఉంచి ట్రీట్మెంట్ చేస్తాం-ఇంచార్జి డాక్టర్ శ్రీనివాస్ సరిపడా డాక్టర్లు, కావాల్సిన మందులు అందుబాటులో ఉన్నాయి-ఇంచార్జి డాక్టర్ శ్రీనివాస్
చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వాస్తవ్యులు పెడవల్లి జగన్నాధం గారి మనవడి ( పెడవల్లి రాజేంద్ర ప్రసాద్ గారి కుమారుడు) నూతన వస్త్ర బహూకరణ వేడుక చిలకలూరిపేట పట్టణంలోని నన్నపనేని కన్వెన్షన్ నందు జరుగుచుండగా ఆ వేడుకలో పాల్గొని చిరంజీవి లోకేష్ సాయి ని ఆశీర్వదించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు… ఈ వేడుకలో వారి వెంట పెడవల్లి వాసు గారు, నాయుడు రమేష్ గారు, దొప్పలపూడి అప్పారావు గారు, చాపలమడుగు రవి గారు, నీరుకొండ బసవయ్య గారు తదితరులున్నారు.









