తల్లికి వందనం పథకాన్ని సమర్దవంతంగా అమలు పరచిన కూటమి ప్రభుత్వానికి మద్దతుగా కూటమి నేతలకు పాలాభిషేకం చేసిన 9 వ వార్డు పార్టీ నేతలు
సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఒక్కొక్క హామీని నిలబెట్టుకునే దిశగా పరుగులు తీస్తున్న కూటమి ప్రభుత్వం,ఇటివల అమలు పరచిన తల్లికి వందనం కార్యక్రమం ప్రతీ నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిందని, దానిని పురస్కరించుకుని కూటమి ప్రభుత్వానికి మద్దతుగా 9 వ వార్డు పరిధిలోని నెహ్రూ నగర్ వద్ద ఉన్న NTR విగ్రహం వద్ద కూటమి పార్టీ నేతలు ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిత్ర పటాలకు పార్టీ నేతలు పాలాభిషేకం చేయడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ముందుగా పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ కరిముల్లా, పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, పార్టీ అధికార ప్రతినిధి మురకొండ మల్లిబాబు NTR విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం కూటమి పార్టీ నేతలకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మహిళలు తమ ఖాతాలలో నిన్న తల్లికి వందనం డబ్బులు జమ అయ్యాయని, గతంలో కుటుంబంలో ఒక్క విద్యార్థికి మాత్రమే అమ్మ ఒడి పథకాన్ని అమలు పరిచారని, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి పథకాన్ని అమలు చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. మాజీ మంత్రి వర్యులు, స్థానిక శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారి నేతృత్వంలో నియోజకవర్గ సమగ్ర అభివృద్ధితో పాటు, రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలతో నియోజకవర్గంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఈ సందర్భంగా పార్టీ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు గోపిదేశి వెంకట్, కార్యదర్శి మామిళ్ళ దాసు, పార్టీ సీనియర్ నేతలు జొన్నలగడ్డ ఫ్రాన్సిస్, బడేమియా, శిఖా నాగరాజు,హనీఫా, ఒంటిపులి వెంకట్ తదితరులు పాల్గొనడం జరిగింది
Trending
- దత్త సాయి సన్నిధి లో విష్ణు సహస్ర నామ పారాయణ భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం —-
- డీఎస్సీ నియామకాలను వెంటనే చేపట్టాలి -ఎస్టీయూ
- ఆగస్ట్ 15 తర్వాత సంక్షేమం అమల్లో దేశంలో ఏపీనే టాప్ : ప్రత్తిపాటి.
- సోనా ప్రసాద్ చేస్తున్న పాదయాత్రకు మద్దతు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు
- మర్రి శ్రీనాథ్ పుట్టినరోజు వేడుకలు
- జనసేన ఆధ్వర్యంలో పట్టణంలో 26వ వార్డులో వృద్ధురాలికి చేయూత
- యోగాంధ్రతో ప్రపంచ రికార్డు
- వినియోగదారుల హక్కుల పోస్టర్ ను ఆవిష్కరించిన తహసిల్దార్ షేక్ మొహమ్మద్ హుస్సేన్