సీఎం.ఆర్.ఎఫ్ సాయం… వ్యాధిగ్రస్తులకు వరం : ప్రత్తిపాటి

  • బాధితులకు రూ.30 లక్షల విలువైన చెక్కులు, ఎల్.ఓ.సీ అందించిన మాజీమంత్రి.
  • పేదల బాధలు తెలిసిన వ్యక్తి కాబట్టే, అధికారంలోకి రాగానే చంద్రబాబు సహాయనిధి పంపిణీని పునరుద్ధరించారు

వివిధ రకాల దీర్ఘకాల వ్యాధులు, తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడే పేదల్ని సీఎం.ఆర్.ఎఫ్ సాయం వరంలా ఆదుకుంటోందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. దీర్ఘకాలిక రోగాలు, వ్యాధులతో బాధపడుతున్న 32 మంది వ్యాధిగ్రస్తులు, వారి కుటుంబసభ్యులకు శనివారం ప్రత్తిపాటి తన నివాసంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల్ని అందచేశారు. 32 మందికి రూ.27.76లక్షల చెక్కులు, అత్యవసర వైద్యసేవల నిమిత్తం ఒకరికి 1.75లక్షల విలువైన ఎల్.ఓ.సీని ప్రత్తిపాటి స్వయంగా బాధితులకు అందించారు. చెక్కులు, ఎల్.వో.సీలు అందించిన అనంతరం ఆయన వారితో మాట్లాడి కుటుంబస్థితిగతుల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత ప్రభుత్వం బటన్ నొక్కుడు ముసుగులో పేదల జీవితాల్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసిందన్నారు. ఒకచేత్తో రూపాయి ఇచ్చి మరో చేత్తో వివిధ మార్గాల్లో 10 రూపాయలు లాక్కుందన్నారు. చెత్తపన్ను..ఇంటిపన్ను.కొళాయిపన్ను అంటూ ఇష్టానుసారం పన్నులేసి, నిత్యావసరాల ధరల పెంపు, కల్తీమద్యం అమ్మకాలతో పేద, మధ్యతరగతి వర్గాల రక్తం పీల్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం.ఆర్.ఎఫ్ పంపిణీని నిలిపివేసిన జగన్ ,అనారోగ్య సమస్యలతో బాధపడే లక్షలాది పేదలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యసేవలు అందకుండా, వారి ఉసురుపోసుకున్నాడని ప్రత్తిపాటి చెప్పారు. పేదల కష్టం.. వారి బాధలు తెలిసిన వ్యక్తి కాబట్టే, చంద్రబాబు అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి సహాయ నిధి పంపిణీని పునరుద్ధరించారని ప్రత్తిపాటి తెలిపారు. ప్రజలకిచ్చిన హామీల్లో ఏడాదిలోనే 70శాతానికిపైగా కూటమిప్రభుత్వం నెరవేర్చిందని, ప్రధానహామీలైన తల్లికి వందనం, అన్నదాతాసుఖీభవ ఈ నెలలోనే అమలుచేయడం చంద్రబాబు నిబద్ధతకు నిదర్శమని ప్రత్తిపాటి కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, నాయకులు జవ్వాజి మధన్ మోహన్, కామినేని సాయిబాబు, మద్దుమలా రవి, నాయకులు తదితలున్నారు

Share.
Leave A Reply