పేటలో కంపోస్టు యార్డును పరిశీలించిన అధికారుల బృందం

చిలకలూరిపేట: పురపాలక సంఘ పరిధిలోని కంపోస్టు యార్డును శనివారం నాడు ఎస్. ఈ.దాసరి శ్రీనివాసరావు.ఆర్.డి. ఎస్ హరికృష్ణ,ఈ.ఈ వెంకటేశ్వర్లు. పబ్లిక్ హెల్త్ రవికుమార్. ఎండి. శ్రీనివాసరావు. (ప్రాంతీయ ఉప కార్యనిర్వాహక ఇంజనీరు) మరియు మున్సిపల్ కమిషనర్ పీ. శ్రీహరి బాబు లు పరిశీలించారు.ఈ పరిశీలనలో యార్డు నిర్వహణ, వ్యర్థాల శుద్ధి ప్రక్రియ, పారిశుద్ధ్య పనులు తదితర అంశాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. యార్డులో జరుగుతున్న పనుల పురోగతిని, వాటి నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కంపోస్టు యార్డు మెరుగుదలకు అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చినట్లు తెలిసింది. పారిశుద్ధ్య నిర్వహణలో కంపోస్టు యార్డు కీలక పాత్ర పోషిస్తున్నందున, దాని పనితీరును మరింత సమర్థవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఈలు సానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply