ప్రజా సమస్యలపై కాలనీ వాసులు ప్రత్తిపాటికి వినతి.

చిలకలూరిపేట పట్టణ ములోని 38వ వార్డు జిడ్డు కాలనీ (గంగమ్మ సుగాలి కాలనీ) లో నెలకొన్న సమస్యల పై మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు కు శనివారం వార్డు నాయకులు వినతి పత్రం అందించడం జరిగింది.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం పడుతున్నా వర్షాలకు చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవసాయ భూమిలో నుంచి నీరు రోడ్లమీదకు ప్రవహిస్తుందని, రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతుందన్నారు.

రానున్న కాలంలో కాలని ప్రజలు మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.

మురుగు కాలువల్లో నీరు పారుదల లేక అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు.

కల్వర్టులు, సీసీ రోడ్లు వేయాలని ప్రత్తిపాటి ని కోరారు. ప్రభుత్వం నుంచి బడ్జెట్ రాగానే చేయిస్తామన్నారు.

ఈ సమస్యలు పరిష్కారం అయే విధంగా చూడాలని మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ రమావతు సాలీబాయి, గిరిజన సంఘం నాయకులు బి.శ్రీను నాయక్,రామవతు దుర్గా నాయక్, మహేష్ నాయక్,యం. వెంకటేష్ నాయక్, ధనలక్ష్మి బాయి తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply