కూటమి ప్రభుత్వం ఫీజుల నియంత్రణపై చర్యలు చేపట్టాలి .

విద్యార్థులకు టీసీలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి.

అనుమతులు లేని కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలను రద్దు చేయాలి-బి.శ్రీను నాయక్.

కూటమి ప్రభుత్వం ఫీజుల దోపిడీని అరికట్టాలని ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి. శ్రీను నాయక్ డిమాండ్ చేశారు.

ఆదివారం పట్టణంలోని ఎన్నారై సెంటర్లోని గల సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలు విద్యను వ్యాపారంగా చేసుకుంటున్నారని ఆరోపించారు.

పేద, బడుగు, బలహీన వర్గాల చెందిన విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందన్నారు.

గత ప్రభుత్వంలో ఎంతో కొంత విద్యార్థుల ఫీజులపై నియంత్రణ ఉండేదని కనీసం ఆ విధంగా లేకపోవడం చాలా దారుణం అన్నారు.

విద్యార్థుల ఫీజుల భారంగా మారడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుల ఊబిలో కోరుకోవలసిన పరిస్థితి నెలకొందన్నారు. కూటమి ప్రభుత్వం తక్షణమే ఫీజుల నియంత్రణపై ప్రతిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. అలా చేయకపోతే ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేయవలసి వస్తుందని హెచ్చరించారు.

Share.
Leave A Reply