మున్సిపాలిటీ అవినీతి కుంభకోణంపై సమగ్ర విచారణ నిర్వహించాలి ఈ వ్యవహారంలో సూత్రధారులెవరో నిగ్గుతేల్చాలి జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి చిలకలూరిపేట మున్సిపాలిటీ లో లక్షల కుంభకోణం వెనుక దాగి ఉన్న పెద్ద మనుషుల భాగోతాన్ని బయటకు వెలికి తీయాలని, ఈ అంశంపై సూత్రధారుల పాత్ర పై సమగ్ర విచారణ నిర్వహించాలని జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి కోరారు. శనివారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బాలాజి మాట్లాడుతూ గత ప్రభుత్వ హాయంలో ఔట్ సోర్సింగ్ చేసిన అవినీతికి కొంతమంది ఉద్యోగులను బాధ్యులను చేసి సస్పెండ్ చేశారని, ఇదే క్రమంలో ఈ ఉద్యోగి తప్పు చేయటానికి కారకులైన వారు, తప్పును కప్పి పుచ్చి కనీస విచారణ కూడా జరగకుండా సంవత్సరాల తరబడి అడ్డుపడినవారిపై చర్యలు ఏవని ప్రశ్నించారు.
Author: chilakaluripetalocalnews@gmail.com
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పట్టిష్టమైన చర్యలు తీసుకోండి – రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ.. లోక్ సత్తా పార్టీ, మాదాసు భాను ప్రసాద్ రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మరియు అడ్వకేట్ మాదాసు భాను ప్రసాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ వ్రాశారు. చిలకలూరిపేట పట్టణంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతో మంది చనిపోయారని, ఇంకా ఎంతోమంది క్షతగాత్రులై జీవితకాలం అంగవైకల్యాన్ని అనుభవిస్తున్నారు. ఆలోచిస్తే, వీటిలో ఎక్కువ శాతం నివారించదగిన రోడ్డు ప్రమాదాలే.కుటుంబంలో ఒక వ్యక్తి మరణిస్తే ఆ నష్టం ఎంత మాత్రమూ భర్తీ చేయలేనిదని మరియు ఎంత నష్ట పరిహారం ఇచ్చినా, ఇన్సూరెన్స్ ఇచ్చిననూ కుటుంబంలో ఆలోటు పూడ్చలేనిదిని లేఖలు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించుటకు కనీస ప్రమాణాలను పాటించకుండా ప్రమాదాలను అరికట్టడం సాధ్యం కాదు అనే విషయం జగమెరిగిన సత్యం. ఓవైపు శాస్త్ర సాంకేతిక…
పోక్సో కేసు లో నిందితుడు అరెస్ట్ జులై 5 వరకు రిమాండ్ విధించిన కోర్టు వివరాలు వెల్లడించిన SI శివ రామకృష్ణ గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం హౌస్‌గణేష్‌పాడు గ్రామ నివాసి ఆళ్ల కొండలు అనే వ్యక్తి, మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ బాలికను మోసపూరితంగా ఆసక్తికరమైన మాటలతో ఆకర్షించి సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన గత నెల 15వ తేదీన జరిగింది. ఈ మేరకు బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా యడ్లపాడు పోలీస్ స్టేషన్లో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నరసరావుపేట డీఎస్పీ పర్యవేక్షణలో విచారణ చేపట్టిన పోలీసులు, సాంకేతిక ఆధారాలతో పాటు వాంగ్మూలాలు సేకరించారు. నిందితుడిని ఈ నెల 22వ తేదీన పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం బోయపాలెం గ్రామంలోని హైవే వంతెన వద్ద పట్టుకున్నారు. శుక్రవారం చిలకలూరిపేట అడిషనల్ జూనియర్ సివిల్‌జడ్జి (జూనియర్ డివిజన్)…
10కేసులు నమోదు….1800రూపాయలు ఫైన్ చిలకలూరిపేట పట్టణంలో వాహనాలు తనిఖీ క్షుణ్ణంగా పరిశీలించిన అర్బన్ SI చేన్నకేసువులు బృందం పట్టణంలో ని కళామందిర్ సెంటర్, NRT సెంటర్, గడియార స్తంభం సెంటర్ లలో బైక్‌లు తనిఖీ వాహనాలు కు సంబంధించి సరైన పత్రాలు, లైలెన్స్ లేని వాహనాలు కు జరిమానా విధించారు. 10కేసులు ఫైల్ చేసి, వారి వద్ద నుంచి 1800 రూపాయలు ఫైన్ వేశారు.
పేదలకు పెన్నిధి.. సీఎం సహాయ నిధి : చీఫ్ విప్ జీవి సీఎం సహాయనిది పేదల పాలిటి పెన్నిదని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారు అన్నారు. నియోజకవర్గ పరిధిలోని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 101 మంది లబ్ధిదారులకు, 52,54,652 లక్షలు చెక్కులను శుక్రవారం తన కార్యాలయంలో చీఫ్ విప్ జీవి గారు పంపిణీ చేశారు. వైద్య పరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వైద్య సహాయం కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించిన నిధులు, తమకు అందేలా కృషిచేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి గారికి చెక్కులు అందుకున్న లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు గారు నాయకులు పాల్గొన్నారు.
చిలకలూరిపేటలో మహా న్యూస్ కి, వాసుకి బాధ్యతలు ప్రముఖ టీవీ ఛానల్ మహా న్యూస్ కి చిలకలూరిపేట నియోజకవర్గ రిపోర్టర్ గా బాధ్యతలు తీసుకున్న మా మిత్రుడు బొందలపాటి వాసుకి ముందుగా శుభాకాంక్షలు… ఈ సందర్భంగా వాసు, మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారిని తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, వాసుకి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రత్తిపాటి మాట్లాడుతూ చిలకలూరిపేట నియోజకవర్గంలో పార్టీలకతీతంగా నిష్పక్షపాతంగా మహా న్యూస్ కి వార్తలు ఇచ్చేలా వాసు తమ బాధ్యతలను నిర్వర్తించాలని భవిష్యత్తులో మహా న్యూస్ లో మరెన్నో బాధ్యతలు తీసుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పుల్లారావు తెలిపారు.
పంచాయతీ ల అభివృద్ధి కి నిధులు మంజూరు-కమిషనర్ కృష్ణ తేజ గణపవరం గ్రామంలో పర్యటించి న పంచాయితీ రాజ్ శాఖ కమిషనర్ కృష్ణ తేజ గణపవరం గ్రామంలో నెలకొన్న సమస్యల పై గ్రామస్తులు తో చర్చ, పాల్గొన్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి గణపవరం గ్రామం చిలకలూరిపేట మున్సిపాలిటీ తో విలీన మైనప్పటి నుంచి నేటి వరకు వివిధ రకాల సమస్యలు తో ఇబ్బందులు పడుతున్నా గ్రామస్తులు త్రాగునీటి ఇబ్బందులు సమస్యను కమిషనర్ కృష్ణ తేజ దృష్టికి తీసుకువచ్చిన గ్రామస్తులు, గ్రామానికి వాటర్ సరఫరా చేసే వాటర్ బెడ్లను, సమ్మర్ స్టోరేజ్ ట్యాన్క్ లను పరిశీలించి న కమిషనర్ కృష్ణ తేజ, ఎమ్మెల్యే ప్రత్తిపాటి సమస్య పరిష్కరించి, గణపవరం గ్రామానికి ఇబ్బందులు లేకుండా చూడాలని పంచాయితీ రాజ్ అధికారులు ను, ఎంపీడీఓ లను ఆదేశించిన- కమిషనర్ తేజ అదేవిధంగా మానుకొండ వారి పాలెం గ్రామంలో వాటర్ ట్యాన్క్ నిర్మాణం పనులు త్వరితగతిన మొదలు పెట్టాలని…
మున్సిపల్ నిధుల స్వాహాలో విడదల రజనీ పాత్రపై సమగ్ర విచారణ జరిపించండి ఇటీవల చిలకలూరిపేట మున్సిపాలిటీలో వెలుగుచూసిన నిధుల స్వాహాలో మాజీమంత్రి రజనీ, అమె మరిది గోపిలే అసలు దోషులని, వారి పాత్ర, ప్రమేయం తేలాంటే నిదులు కాజేసి పరారైన ఇక్తుర్తి గంగాభవాని, ఆమె భర్త పవన్ లను విచారించాలని స్థానికుడు షేక్ మాబు సుభాని మరియు స్థానికులు మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుని కోరారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మాజీమంత్రి ప్రత్తిపాటి ప్రజావేదిక నిర్వహిం చారు.
నరసరావుపేటలో ప్రజా సమస్యల ప్రజావేదిక పాల్గొన్న ఎమ్మెల్యే డా”చదలవాడ నరసరావుపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ప్రజావేదిక (PGRS) కార్యక్రమన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో నరసరావుపేట శాసనసభ్యులు డా”చదలవాడ అరవింద బాబు నియోజకవర్గంలోని ప్రజల వద్ద నుండి వినతి పత్రాలను అందుకున్నారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రజా వేదిక కార్యక్రమంలో భాగంగా ప్రతి శుక్రవారం నియోజకవర్గం టీడీపీ కార్యాలయం నందు ప్రజల సమస్యలు తెలుసుకొనుటకు ప్రజా వేదిక నిర్వహిస్తున్నామని ప్రజా వద్ద నుండి పెద్ద ఎత్తున వినతి పత్రాలు వస్తున్నాయని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా ప్రభుత్వం పని చేస్తుందని నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకొని సంబంధిత అధికారుల ద్వారా సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలియజేశారు వచ్చే నెల నుండి రైతులకు 20.000/- రూపాయల ఆర్ధిక…
యడ్లపాడు–1 సచివాలయాన్ని సందర్శించిన తహశీల్దార్– రేషన్ కార్డులపై క్షేత్రస్థాయి పరిశీలన యడ్లపాడు మండల తహశీల్దార్ జెట్టి విజయశ్రీ గురువారం యడ్లపాడు–1 సచివాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై అక్కడి సిబ్బందితో సమావేశమై దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, అర్హత నిర్ణయం తదితర ప్రక్రియలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అర్హులైన ప్రతికుటుంబానికి రేషన్ కార్డు మంజూరు చేయాలని, అనర్హుల వద్ద నుంచి పథకాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా అధికారులపై ఉందన్న విషయాన్ని విస్మరించ వద్దన్నారు. రేషన్‌కార్డుల మంజూరుపై సిబ్బందికి స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. ఆమె వెంట ఉపతహశీల్దారు అనురాధ, మండల రెవెన్యూ ఇన్సె్పక్టర్ సుబ్బారావు, వీఆర్వో కేఏ చారి, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–6 స్వాతిప్రియ, జీఎంఎస్కే రేవతి తదితరులు ఉన్నారు.









