Author: chilakaluripetalocalnews@gmail.com

మాచవరం ఎస్ఐగా ఎం రోశయ్య బాధ్యతలు స్వీకరణ మాచవరం పోలీస్ స్టేషన్ ఎస్ఐగా ఎం రోశయ్య బుధవారం బాధ్యతలు చేపట్టారు గుంటూరు రైల్వే పోలీస్ విభాగంలో పనిచేస్తూ పదోన్నతి పై మాచవరం ఎస్సైగా బాధ్యతలు చేపట్టారు ఇప్పటివరకు పని చేసిన కే సతీష్ లాంగ్ లీవ్ పై వెళ్లారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపడితే కటిక చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది నూతన ఎస్సై రోసీలు శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు మీ రమేష్ సీనియర్ జర్నలిస్ట్ మాచవరం మండలం

Read More

నరసరావుపేట పట్టణంలోని భువనచంద్ర టౌన్ హాల్లో జరిగిన పల్నాడు జిల్లా మహానాడు కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు పాల్గొనడం జరిగింది. కడపలో ఈనెల 27, 28, 29 తేదీల్లో తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడు కార్యక్రమానికి జిల్లా నుండి భారీగా ప్రజల తరలి వెళ్లాలని కోరడం జరిగింది. జిల్లా ప్రగతికి, ప్రజల అభ్యున్నతికి ప్రజా ప్రతినిధులందరం కట్టుబడి ఉన్నామని తెలియజేస్తూ.. 2024 ఎన్నికల్లో కొనసాగించిన ఉత్సాహంతో నేతలు ముందుకు సాగినప్పుడే పార్టీ బలోపేతం అవుతుంది.

Read More

భీమేశ్వ‌ర‌స్వామి ప్ర‌తిష్ఠా మ‌హోత్స‌వంలో మాజీమంత్రి ప్ర‌త్తిపాటి చిలకలూరిపేట మండ‌లం గోవిందాపురంలో బుధ‌వారం క‌న్నుల పండువగా జ‌రిగిన శ్రీ గంగా సమేత భీమేశ్వర స్వామి వారి ప్రతిష్ఠ మహోత్సవంలో మాజీ మంత్రివర్యులు శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. న‌ర‌స‌రావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలుతో క‌లిసి స్వామి వారిని ద‌ర్శించుకున్న ఆయ‌న, ప్ర‌తిష్ఠ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించి నిర్వాహ‌కుల‌తో మాట్లాడారు. గ్రామ‌స్తులంతా క‌లిసిక‌ట్టుగా స్వామివారి ప్ర‌తిష్ఠామ‌హోత్స‌వం నిర్వ‌హించ‌డంపై సంతోషం వ్య‌క్తంచేసిన‌ ప్ర‌త్తిపాటి వారిని అభినందించారు. ప్ర‌త్తిపాటి, ఎంపీ లావు ఆల‌యంలో నిర్వ‌హించిన ప్ర‌త్యేక పూజ‌ల్లో పాల్గొని స్వామివారి తీర్థ‌ప్ర‌సాదాలు స్వీక‌రించారు. కార్య‌క్ర‌మంలో నాయకులు నెల్లూరి సదాశివరావు, జవ్వాజి మధన్ మోహన్, షేక్ టీడీపీ కరిముల్లా, కామినేని సాయిబాబు, గుత్తా వెంకటేశ్వర్లు, కందుల రమణ, తుబాటి శ్రీహరి, తుపాకుల అప్పారావు, గోపి, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Read More

చిలకలూరిపేట మండలం గోవిందపురం గ్రామంలో గంగా పార్వతీ సమేత శ్రీ భీమేశ్వర స్వామి మరియు పరివార దేవతల జీవ ధ్వజ, పున ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుండగా గ్రామ ప్రజలు మరియు భక్త బృందం వారి ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆ ప్రతిష్టా మహోత్సవ వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొని శ్రీ అమ్మవారి మరియు స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి,తీర్థ ప్రసాదాలు స్వీకరించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు, శ్రీ సోమేపల్లి వెంకటసుబ్బయ్య గారు… ఈ ప్రతిష్టా మహోత్సవము లో వారికి సాదర స్వాగతం పలికిన గుత్తా యామలయ్య గారు,నీరుకొండ బసవయ్య గారు, పావులూరి చంద్రమౌళి గారు, నీరుకొండ సుబ్బారావు గారు, పెద్ది కిషోర్ గారు, కల్లం చంద్రశేఖర్ రెడ్డి గారు, శశిధర్ గారు తదితరులు.

Read More

నరసరావుపేట పట్టణంలోని కాసు కన్వెన్షన్ నందు జరుగుచున్న చిలకలూరిపేట పట్టణ రత్న స్వగృహ ఫుడ్స్ అధినేత తవ్వా శ్రీను గారి కుమారుడు మరియు మునిసిపల్ వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీను గారి మేనకోడలి వివాహ మహోత్సవానికి హాజరై, ఆ నూతన వధూవరులు రాహుల్ – భార్గవి గార్లను ఆశీర్వదించి, వారికి వివాహ శుభాకాంక్షలు తెలియచేసిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…ఈ కార్యక్రమంలో షేక్ కరీముల్లా గారు, జవ్వాజి మదన్ గారు, కామినేని సాయిబాబా గారు, కందుల రమణ గారు, తుపాకుల అప్పారావు గారు, తుబాటి శ్రీహరి గారు, గట్టా హేమ గారు, కొల్లా ఉమా గారు తదితరులు పాల్గొన్నారు…

Read More

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు నాడు సేవా సమితి తరపున చిలకలూరిపేట పట్టణ అధికార ప్రతినిధిగా చిలకలూరిపేట నియోజకవర్గంకాపు నాయకులు పెద్ది శెట్టి వెంకటరమణ నియామకం చేయడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి రాష్ట్ర కార్యాలయంలో పెద్ది శెట్టి వెంకటరమణ లో చిలకలూరిపేట పట్టణ అధికారి ప్రతినిధిగా నియమితులైన వెంకటరమణ కు జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు నియామక పత్రం అందించడం జరిగింది. తదుపరి నియమితులైన రమణను ఘనంగా సన్మానించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. నియామక పత్రం అందుకున్న వెంకటరమణ సంస్థ అన్ని కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేస్తానని సమస్త అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఈ నియామకం సహకరించిన జాతీయ నాయకులకు రాష్ట్ర నాయకులకు చిలకలూరిపేట నియోజకవర్గ నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏనుగుల వెంకటేశ్వర్లు…

Read More

మీడియా పై జరుగుతున్న దాడులు అరికట్టాలి-APUWJ సాక్షి ప్రతినిధి పై జరిగిన దాడికి నిరసనగా బుధవారం ఉదయం చిలకలూరిపేట తహసీల్దార్ కార్యాలయంవద్ద జర్నలిస్ట్ ల ధర్నా ధర్నా లో పాల్గొన్న జర్నలిస్టులు…. దాడులకు వ్యతిరేకంగా నినాదాలు… జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించిన APUWJ అనుబంధశాఖ పత్రిక స్వేచ్ఛ ను ప్రతి ఒక్కరు గౌరవించాలని… స్వేచ్ఛాయూత సమాజంలో ఒకరిపై మరొకరు దాడి చేయడం అన్యామని జర్నలిస్టులు ఖండించారు. విలేకరుల పై జరుగుతున్న దాడులను నియంత్రి Oచాలని ఎమ్మార్వో కు వినతిపత్రం అందజేశారు.

Read More

లిక్కర్ స్కామ్ లో జగన్ జైలుకెళ్లడం ఖాయం : మాజీమంత్రి ప్రత్తిపాటి చిలకలూరిపేటలో గత ఎన్నికల్లో అవినీతికి పాల్పడిన మాజీమంత్రి పోటీ చేసి ఉంటే టీడీపీకి లక్షల్లో మెజారిటీ వచ్చేదని, స్వాతంత్ర్యం వచ్చాక ఎన్నడూ రానంత భారీ మెజారిటీతో 2024 ఎన్నికల్లో తనను గెలిపించారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. మంగళవారం సాయంత్రం పట్టణంలోని ప్రత్తిపాటి గార్డెన్స్ లో జరిగిన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడులో పాల్గొన్న ఎంపీ లావు కృష్ణదేవరాయలు, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్, నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవిందబాబు తో కలిసి మొదట తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించి, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రత్తిపాటి కీలక ప్రసంగం చేశారు. గత ఎన్నికల్లో ఓడిపోతానని తెలిసే మాజీమంత్రి తెలివిగా చిలకలూరిపేటలో పోటీచేయకుండా తప్పుకొని గుంటూరుకు చెక్కేసిందని ప్రత్తిపాటి…

Read More

నరసరావుపేట, కలెక్టరేట్ లో జరిగిన బ్యాంకర్ల సమావేశంలో,, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు, జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు గారు పాల్గొన్నారు. ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని, ఇందులో బ్యాంకింగ్ రంగం వారు చేయూతనివ్వాలని తెలియజేయడం జరిగింది. రుణాల మంజూరు విషయంలో బ్యాంకర్లు నిర్లక్ష్య వైఖరిని వీడాలని తెలియజేస్తూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే లోన్ లను అర్హులకు జాప్యం లేకుండా అందజేయాలని సూచిస్తూ.. పల్నాడు జిల్లాలో ఏ బ్యాంక్ పరిస్థితి చూసినా రుణాలు మంజూరు తక్కువగా ఉందని,, ఈ సంఖ్యను పెంచాలని ఆదేశించటం జరిగింది.

Read More

పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా వ్యాప్తంగా BD Team, డాగ్ స్క్వాడ్ మరియు లోకల్ పోలీసు వారు ఉదయం నుండి నరసరావుపేట కోటప్పకొండ దేవస్థానం మరియు గురజాల సబ్ డివిజన్ పరిధిలోని ప్రసిద్ధ దేవాలయాల నందు యాంటీ సబటెజ్ లో భాగంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది.

Read More