ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు నాడు సేవా సమితి తరపున చిలకలూరిపేట పట్టణ అధికార ప్రతినిధిగా చిలకలూరిపేట నియోజకవర్గంకాపు నాయకులు పెద్ది శెట్టి వెంకటరమణ నియామకం చేయడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి రాష్ట్ర కార్యాలయంలో పెద్ది శెట్టి వెంకటరమణ లో చిలకలూరిపేట పట్టణ అధికారి ప్రతినిధిగా నియమితులైన వెంకటరమణ కు జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు నియామక పత్రం అందించడం జరిగింది. తదుపరి నియమితులైన రమణను ఘనంగా సన్మానించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. నియామక పత్రం అందుకున్న వెంకటరమణ సంస్థ అన్ని కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేస్తానని సమస్త అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఈ నియామకం సహకరించిన జాతీయ నాయకులకు రాష్ట్ర నాయకులకు చిలకలూరిపేట నియోజకవర్గ నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏనుగుల వెంకటేశ్వర్లు…
Author: chilakaluripetalocalnews@gmail.com
మీడియా పై జరుగుతున్న దాడులు అరికట్టాలి-APUWJ సాక్షి ప్రతినిధి పై జరిగిన దాడికి నిరసనగా బుధవారం ఉదయం చిలకలూరిపేట తహసీల్దార్ కార్యాలయంవద్ద జర్నలిస్ట్ ల ధర్నా ధర్నా లో పాల్గొన్న జర్నలిస్టులు…. దాడులకు వ్యతిరేకంగా నినాదాలు… జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించిన APUWJ అనుబంధశాఖ పత్రిక స్వేచ్ఛ ను ప్రతి ఒక్కరు గౌరవించాలని… స్వేచ్ఛాయూత సమాజంలో ఒకరిపై మరొకరు దాడి చేయడం అన్యామని జర్నలిస్టులు ఖండించారు. విలేకరుల పై జరుగుతున్న దాడులను నియంత్రి Oచాలని ఎమ్మార్వో కు వినతిపత్రం అందజేశారు.
లిక్కర్ స్కామ్ లో జగన్ జైలుకెళ్లడం ఖాయం : మాజీమంత్రి ప్రత్తిపాటి చిలకలూరిపేటలో గత ఎన్నికల్లో అవినీతికి పాల్పడిన మాజీమంత్రి పోటీ చేసి ఉంటే టీడీపీకి లక్షల్లో మెజారిటీ వచ్చేదని, స్వాతంత్ర్యం వచ్చాక ఎన్నడూ రానంత భారీ మెజారిటీతో 2024 ఎన్నికల్లో తనను గెలిపించారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. మంగళవారం సాయంత్రం పట్టణంలోని ప్రత్తిపాటి గార్డెన్స్ లో జరిగిన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడులో పాల్గొన్న ఎంపీ లావు కృష్ణదేవరాయలు, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్, నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవిందబాబు తో కలిసి మొదట తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించి, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రత్తిపాటి కీలక ప్రసంగం చేశారు. గత ఎన్నికల్లో ఓడిపోతానని తెలిసే మాజీమంత్రి తెలివిగా చిలకలూరిపేటలో పోటీచేయకుండా తప్పుకొని గుంటూరుకు చెక్కేసిందని ప్రత్తిపాటి…
నరసరావుపేట, కలెక్టరేట్ లో జరిగిన బ్యాంకర్ల సమావేశంలో,, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు, జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు గారు పాల్గొన్నారు. ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని, ఇందులో బ్యాంకింగ్ రంగం వారు చేయూతనివ్వాలని తెలియజేయడం జరిగింది. రుణాల మంజూరు విషయంలో బ్యాంకర్లు నిర్లక్ష్య వైఖరిని వీడాలని తెలియజేస్తూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే లోన్ లను అర్హులకు జాప్యం లేకుండా అందజేయాలని సూచిస్తూ.. పల్నాడు జిల్లాలో ఏ బ్యాంక్ పరిస్థితి చూసినా రుణాలు మంజూరు తక్కువగా ఉందని,, ఈ సంఖ్యను పెంచాలని ఆదేశించటం జరిగింది.
పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా వ్యాప్తంగా BD Team, డాగ్ స్క్వాడ్ మరియు లోకల్ పోలీసు వారు ఉదయం నుండి నరసరావుపేట కోటప్పకొండ దేవస్థానం మరియు గురజాల సబ్ డివిజన్ పరిధిలోని ప్రసిద్ధ దేవాలయాల నందు యాంటీ సబటెజ్ లో భాగంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది.
వీధి నాటకము ద్వారా హెచ్ఐవి/ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం చిలకలూరిపేట : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశముల మేరకు జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ పల్నాడు జిల్లా వారి సహకారం తో స్థానిక క్యాంప్ స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 20 వ తారీకు సాయంత్రం 5 గంటలకు చిలకలూరిపేట లోని కళామందిర్ సెంటర్ నందు కళాజాతర బృందాలతో వీధినాటకముల ద్వార హెచ్ఐవి/ఎయిడ్స్ పై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ వీధి నాటకములు ద్వారా హెచ్ఐవి/ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, ఎలా వ్యాపించదు, రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్ఐవి/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్న చూపు లేకుండా ఎలాగా సమాజంలో కలిసి జీవించాలి, హెచ్ఐవి/ఎయిడ్స్ -క్షయ వ్యాధి సంబంధం గురించి, సుఖవ్యాధులు మరియు చికిత్స గురించి, కండోమ్ యొక్క ఉపయోగం గురించి, హెచ్ఐవి/ఎయిడ్స్ ఆక్ట్ 2017 గురించి ప్రజలలో అవగాహనా కల్పించారు. సిహెచ్…
చిలకలూరిపేట ఏఐటియుసి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చిలకలూరిపేట : కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా మంగళవారం ఉదయం చిలకలూరిపేట పట్టణంలోని ఎన్నార్టీ సెంటర్ సిపిఐ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగినది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె వాయిదా పడిన నేపథ్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చిలకలూరిపేట నియోజకవర్గ ఏఐటియుసి అధ్యక్షులు పేలురి రామారావు తెలిపారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ కార్మిక , కర్షకులకు నడ్డి విరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేయాలని తెలిపారు. కార్మికులకు కార్మిక శాఖ ద్వారా సభ్యత్వాలను నమోదు చేసి సంక్షేమ పథకాలను అమలు చేయాలని తెలిపారు. నిరసన…
చిలకలూరిపేట నియోజకవర్గం, యడ్లపాడు మండలం, జాలాది గ్రామంలో పాస్టర్ కూరాకుల సుధాకర్, పాస్టర్ కూరాకుల రాజేష్ గార్ల ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన హెబ్రోను ప్రార్థన మందిరాన్ని ప్రారంభించి, అనంతరం ప్రార్ధన మందిర కమిటీ వారు ఏర్పాటు చేసిన ప్రార్ధనల్లో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కన్వీనర్ తోట రాజరమేష్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా గారు, నెల్లూరి సదాశివరావు గారు, జవ్వాజి మదన్ గారు, కామినేని సాయిబాబా గారు, కందిమళ్ళ రఘురామరావు గారు, పోపూరి వెంకయ్య గారు, పోపూరి శ్రీనివాసరావు గారు, పుటిగంటి వెంకటేశ్వరరావు గారు మరియు మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు…
టీడీపీ ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమం ఈ ఏడాది పండుగ వాతావరణం లో, గతంలో ఎన్నడూ జరుగని విధంగా, కనివిని ఎరుగని రీతిలో మహానాడు నిర్వహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ మేరకు మహానాడు కు సంబంధించి కమిటీ లు నియమించారు. జనసమీకరణ కమిటీ లో19మందిని నియమిస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ19మంది లో చిలకలూరిపేట శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ను నియమించారు. మహానాడు పండుగ కు లక్షల లో జనసమికరణ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఈ పని ని ఎమ్మెల్యే ప్రత్తిపాటి కి అప్పగించారు. దీంతో చిలకలూరిపేట నియోజకవర్గ టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.
పిడుగుపాటు మృతురాలి కుటుంబానికి ఆర్థికసాయం అందజేసిన ప్రత్తిపాటి 50000ఆర్థిక సహాయ చెక్కును అందించిన ఎమ్మెల్యే పొలంపనులకు వెళ్లి పిడుగుపాటుతో మరణించిన షేక్ పర్వీన్ కుటుంబానికి ప్రభుత్వం అందచేసిన రూ.50వేల ఆర్థికసాయం చెక్కును మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు మంగళవారం అందచేశారు. యడ్లపాడు మండలం కారుచోల గ్రామానికి చెందిన షేక్ పర్వీన్ ఈ నెల 14వ తేదీన కూలిపనులకు వెళ్లినప్పుడు పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె మరణ వార్త తెలిసిన వెంటనే మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పిన ప్రత్తిపాటి, తాజాగా ఆమె భర్త జాన్ సైదాకు ఆర్డీవో మధులత సమక్షంలో రూ.50వేల చెక్కును అందచేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సాయం కూడా త్వరలోనే అందేలా చూస్తానని ప్రత్తిపాటి చెప్పారు. భార్య మృతితో అధైర్యపడకుండా పిల్లలను జాగ్రత్తగా చదివించి ప్రయోజకుల్ని చేయాలని ప్రత్తిపాటి సైదాకు సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కామినేని సాయిబాబు, కారుచోలా గ్రామా నాయకులు పాల్గొన్నారు.









