ఇకనైనా డ్రంక్ అండ్ డ్రైవింగ్ ను నియంత్రించండి! లోక్ సత్తా భాను ప్రసాద్..

ఇటీవల నేషనల్ హైవే పై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన హోంగార్డు శ్రీనివాసరావును మరియు వారి కుమారుడిని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర నాయకులు మాదాసు భాను ప్రసాద్ పరామర్శించారు.
నేషనల్ హైవే పై మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ, వెనక నుండి అతి వేగంగా వచ్చి గుద్దటం ద్వారా ప్రమాదం జరిగినట్టుగా శ్రీనివాసరావు చెప్పారని అన్నారు. ఈ సందర్భంగా భాను ప్రసాద్ మాట్లాడుతూ కొన్ని మాసాల క్రిందట కోటప్పకొండ రోడ్లో విధులు నిర్వహించి వస్తున్న ఒక కానిస్టేబుల్ కూడా రోడ్డు ప్రమాదం కారణంగా మృతి చెందడం జరిగిందని అన్నారు.
చిలకలూరిపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని ఇప్పటికైనా అధికారులు డ్రంక్ అండ్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్ ను నియంత్రించాలని కోరారు.

Share.
Leave A Reply