జగన్ వీధి నాటకాలను తిప్పకొట్టాలి
కూటమి ప్రభుత్వ సుపరిపాలనకు మద్దతుగా
అరాచక పాలన ముగిసి ఏడాది పూర్తయిన సందర్బంగా
కదలండి.. పండగ చేసుకుందాం.
జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి
చిలకలరిపేట:
ఏపీని అన్నిరంగాల్లో కటిక చీకట్లలోకి నెట్టి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని హతమార్చిన వైసీపీ అధినేత జగన్ ప్రజా తీర్పు ను అపహాస్యం చేస్తున్నారని, వెన్నుపోటు దినం పేరుతో కొత్త డ్రామాకు తెరతీస్తున్నారని జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి విమర్శించారు. సోమవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బాలాజి మాట్లాడుతూ ప్రజలు ఓటు వేసి గెలిపించిన జూన్ 4వ తేదీ వైసీపీ అధినేత వెన్నుపోటు దినోత్సవంగా పేర్కొంటూ నిరసనలకు పిలుపు నివ్వడం తన ఉనికికి కాపాడుకోవడానికేనని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలకు జనరంజక పాలన అందిస్తున్న తరుణంలో ఏడాది గడవక ముందే నిరసనలకు పిలుపు నిచ్చి, ప్రజా మద్దతు లేక మమ అని పించారని గుర్తు చేశారు. తానేదో రాష్ట్రం కోసం జీవితాన్ని ధారపోసినట్లు నక్క వినయాలు ప్రదర్శిస్తే.. మళ్లీ ప్రజలు నమ్ముతారని అనుకోవడం జగన్ భ్రమని పేర్కొన్నారు. జనాన్ని పీడించి జనం చేతిలో చావుదెబ్బ తిన్న తరువాత కూడా జగన్‌లో మార్పు రాలేదని, ప్రతిపక్ష హోదా కూడా దక్కనంతగా ప్రజలు తిరస్కరించినా తన బుద్ది మార్చుకోవడం లేదన్నారు. . రాజకీయ ప్రయోజనాల కోసం కోసం చేసే వీధి నాటకాలను ప్రజలు తిప్పి కొడుతున్నారని తెలిపారు.
కదలండి.. పండగ చేసుకుందాం…
రాష్ట్రంలో అరాచక పాలన సాగించిన వైసీపీ మూకలను రాష్ట్ర ప్రజలు తరిమివేసి ఏడాది పూర్తయి, కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో… రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై చేస్తున్న సుపరిపాలనకు ఒక వసంతం పూర్తయిందని బాలాజి చెప్పారు. . ఈ శుభ తరుణాన్ని పురస్కరించుకుని పండగ చేసుకుందామని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారని తెలిపారు. జూన్ 4వ తేదీన సంక్రాంతి- దీపావళి పండుగను కలిపి చేసుకుందామని, ఉదయం వాకిళ్లను రంగవల్లులతో అలంకరించి, పీడ విరగడై ఏడాది అయిన సందర్భంగా సాయంత్రం దీపావళి మాదిరిగా దీపాలు వెలిగించి. టపాకాయలు కాల్చాలని జనసేన పార్టీ పిలుపు నిచ్చిందని వివరించారు. ప్రజాభిష్టం మేరకు సంక్షేమాభివృద్ది పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి మద్దతుగా, వైసీపీ కూటిల రాజకీయాలకు వ్యతిరేకంగా జనసైనికులు, వీర మహిళలు ఈ పండుగ ను జరుపుకోవాలని బాలాజి కోరారు
Trending
- మండలనేని సుబ్బారావు పుట్టినరోజు
- దత్త సాయి సన్నిధి లో విష్ణు సహస్ర నామ పారాయణ భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం —-
- డీఎస్సీ నియామకాలను వెంటనే చేపట్టాలి -ఎస్టీయూ
- ఆగస్ట్ 15 తర్వాత సంక్షేమం అమల్లో దేశంలో ఏపీనే టాప్ : ప్రత్తిపాటి.
- సోనా ప్రసాద్ చేస్తున్న పాదయాత్రకు మద్దతు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు
- మర్రి శ్రీనాథ్ పుట్టినరోజు వేడుకలు
- జనసేన ఆధ్వర్యంలో పట్టణంలో 26వ వార్డులో వృద్ధురాలికి చేయూత
- యోగాంధ్రతో ప్రపంచ రికార్డు