నూతన ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు

చిలకలూరిపేట:పసుమర్రులో పర్యటించిన శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అధికారులతో కలిసి నూతన ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇకనుంచి పేదలు రేషన్ సరుకులను రేషన్ దుకాణాల వద్దే తీసుకోవాలని స్పష్టం చేశారు.ప్రజా పంపిణీ వ్యవస్థలో అవకతవకలకు తావులేకుండా రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుందని ఎమ్మెల్యే పుల్లారావు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ రేషన్ సరఫరా జరగలేదని, ఇంటింటికీ రేషన్ సరుకులు పేరుతో ప్రజలను మోసం చేసిన ఘనత జగన్‌దే అని ఆయన విమర్శించారు.అయితే, 65 సంవత్సరాల వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం రేషన్ డీలర్లు ఇంటి వద్దకే వచ్చి సరుకులు అందజేస్తారని ఎమ్మెల్యే పుల్లారావు వెల్లడించారు.

రేషన్ డీలర్లు ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Share.
Leave A Reply