ఆర్డీవో గా డివిజన్ లో మంచి పేరు తీసుకురావాలి
నరసరావుపేట డివిజన్ లో ప్రజలకు మంచి సేవ చేయాలని నూతన ఆర్డీవో బాలకృష్ణ ని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. ఆర్డీవో గా బాధ్యతలు చేపట్టిన అనంతరం బాలకృష్ణ ఆదివారం చిలకలూరిపేట లోని ఎమ్మెల్యే నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజలకు మంచి సేవలు అందిస్తూ అందరికీ అందుబాటులో ఉండాలని , డివిజన్ కి మంచి పేరు తీసుకురావాలని ఆర్డీవో కు ఎమ్మెల్యే సూచించారు.



