కార్యకర్తల సంక్షేమానికి నావంతు సహాకారం అందించడం ఎంతో తృప్తినిచ్చింది : మాజీమంత్రి ప్రత్తిపాటి “తెలుగుదేశం పార్టీ కుటుంబసభ్యుడిగా, ప్రజాప్రతినిధిగా, మాజీమంత్రిగా పార్టీని నమ్ముకున్న కార్యకర్తల సంక్షేమానికి, వారి కుటుంబాలకు చేయూతగా నిలిచాను. అధినేత చంద్రబాబు నాయుడి పిలుపునకు స్పందించి, మహానాడు వేదికపై స్వయంగా ఆయనకు రూ.25లక్షల విరాళం అందించడం ఎంతో సంతోషాన్చిచ్చింది. కార్యకర్తల యోగక్షేమాల గురించి తపన పడే నాయకుడు మనకు, మనపార్టీకి సారథిగా ఉండటం మనందరి అదృష్టమనే చెప్పాలి. చంద్రబాబు నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, కార్యకర్తలకు కొండంత అండగా నిలుస్తున్న లోకేశ్ బాబు సేవల్ని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. లోకేశ్ ఆలోచనల నుంచి పుట్టిన ‘కార్యకర్తే అధినేత’ అన్న సరికొత్త నినాదం తెలుగుదేశం పార్టీకి కచ్చితంగా కొత్త శక్తియుక్తులు అందిస్తుంది. పార్టీ మనుగడతో పాటు, ఉజ్వల భవిష్యత్ కోసం యువశక్తిని ప్రోత్సహిస్తూనే, అనుభవానికి పెద్దపీటవేసి, పెద్దలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్న లోకేశ్ నిర్ణయం నిజంగా పార్టీకి, ప్రభుత్వానికి సత్ఫలితాలు ఇస్తుంది.…
Author: chilakaluripetalocalnews@gmail.com
వినుకొండ : ప్రభుత్వ చీప్ విప్ మరియు వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు వినుకొండ మున్సిపల్ కమిషనర్ సూచనలతో రాబోయే వర్షాభావ పరిస్థితులను దృష్టి నందు ఉంచుకొని పురపాలక సంఘ పరిధిలో ఎటువంటి వరదలు సంభవించకుండా, రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా నివారించేందుకు దుర్గం దాన్ని తొలగించుటకు, దోమల పెరుగుదలను అరికట్టేందుకు పట్టణ పరిధిలో ఉన్న అన్ని మేజర్ డ్రైనేజీలు డీసిల్టేషన్ చేయించవలసిందిగా నిర్ణయించి ఉన్నారు. దీనిలో భాగంగా బిపిఎస్ 2019 మరియు ఎల్ఆర్ఎస్ 2020 నియమాలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం పట్టణానికి కేటాయించిన 44.59 లక్షల నిధులతో పలు విడతలుగా కాలువ పూడిక తీసివేత ప్రారంభించి ఉన్నారు. ఇందులో భాగంగా గత రెండు రోజులుగా పట్టణంలోని వివిధ వార్డుల యందు అనగా అంబేద్కర్ కాలనీ, శృంగారపు వనం, పల్నాడు రోడ్డు మెయిన్ డ్రైనేజీ, మార్కాపురం రోడ్డు మెయిన్ డ్రైన్ డబ్బా స్తంభం సెంటర్,కోట్నాల్స బజార్ మొదలగు…
పల్నాడు జిల్లాలోని రొంపిచర్ల పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపిఎస్ ,. రొంపిచర్ల పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పరిస్థితులను, సిబ్బంది పనితీరును పరిశీలించిన ఎస్పి కంచి శ్రీనివాసరావు , రొంపిచర్ల పోలీస్ స్టేషన్ రిసెప్షన్ నందు వచ్చినటువంటి కంప్లైంట్ రిజిస్టర్ ను తనిఖీ చేసినారు,లాకప్ మరియు స్టేషన్ పరిసరాలు తనిఖీ చేశారు. అనుమతి లేకుండా లాకప్ నందు ఎవరిని ఉంచవద్దని ఎస్పీ స్టేషన్ అధికారులకు తెలిపారు, అదేవిధంగా దర్యాప్తులో ఉన్న కేసులలో సత్వరమే బాధితులకు న్యాయం చేయాలని, స్టేషన్ అధికారులకు తగిన సూచనలు చేశారు. అదేవిధంగా రిసెప్షన్ లో ఉన్నటువంటి సిబ్బంది పనితీరును మరియు వారు చేస్తున్నటువంటి విధులకు సంబంధించి ఏ విధంగా చేయుచున్నారో వారిని అడగడం జరిగింది. రాత్రి గస్తీకు వెళ్లే సిబ్బందితో మాట్లాడి గస్తీ ముమ్మరం గా…
ఈ నెల 31న మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం ఈ నెల 31 శనివారం ఉదయం11గంటలు కు జరగనుంది. మున్సిపల్ చైర్మన్ రఫాని అధ్యక్షత న జరిగే ఈ కౌన్సిల్ సమావేశంలో పలు అభివృద్ధి అంశాలను చర్చించనున్నారు. పట్టణంలో చేసిన అభివృద్ధి పనులు, చేపట్టాల్సిన పనుల కు సంబంధించి అజెండాలో అంశాలను చేర్చి కౌన్సిల్ ఆమోదానికి సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు. పట్టణాభివృద్ధి కి సంబంధించిన అంశాలను అజెండాలో చేర్చారు. 38వార్డులకు చెందిన కౌన్సిలర్లు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
కొండవీడు లో పర్యాటకుల పై సిబ్బంది దాడి ఒకరిని ఒకరు విచక్షణ రహితంగా తిట్టుకున్నా సిబ్బంది ,పర్యాటకులు కుటుంబ సభ్యులతో కలిసి కొండవీడుకు వచ్చిన పర్యాటకులు కొండవీడు సందర్శన సమయం అయిపోవడంతో సిబ్బంది కి , కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం కుటుంబ సభ్యులపై కాంట్రాక్టర్ అతని సిబ్బంది దాడి చేసినట్లు సమాచారం. కొండవీడు ఘటన పై పూర్తి స్థాయిలో విచారణ మొదలు పెట్టిన చిలకలూరిపేట రూరల్ CI సుబ్బానాయుడు బృందం పర్యాటకుల కు ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ అటవీ శాఖ సిబ్బంది ని విచారించి న CI సుబ్బానాయుడు వివాదానికి దారి తీసిన అంశాల గురించి పోలీసులు ఆరా
తెలుగువారి ఆరాధ్యదైవం, తెలుగునేల తరగని ఆస్తి ఎన్టీఆర్ : మాజీమంత్రి ప్రత్తిపాటి “తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మహానాయకుడు, మహానుభావుడు, కారణజన్ముడు స్వర్గీయ నందమూరి తారక రామారావుగారు. తెలుగువారి ఆరాధ్యదైవం.. తెలుగునేలకు ఎన్నటికీ, ఎప్పటికీ తరగని ఆస్తి ఎన్టీఆర్. 1923 మే 28న కృష్ణాజిల్లా పామర్రు మండలం నిమ్మకూరులో జన్మించిన ఎన్టీఆర్ కృషి, పట్టుదల, మొండితనం, మొక్కవోని సంకల్పంతో అంచెలంచెలుగా ఎదిగి, సినీ.. రాజకీయ రంగాల్లో మకుటం లేని మహారాజుగా వెలుగొందారు. ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ప్రజల్లోకి వచ్చిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దశ, దిశ మార్చింది. 1983 జనవరి 9న రాష్ట్రంలో తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా స్వర్గీయ ఎన్టీఆర్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయన పాలన తెలుగుప్రజలకు స్వర్ణయుగమనే చెప్పాలి.
పట్టణంలో కరెంట్ కట్ చేసే ఏరియాలు 28.05.25 బుధవారం విద్యుత్ లైన్ల మరమ్మత్తులు కారణముగా చిలకలూరిపేట టౌన్ 1 పరిధిలోని వాసవి నగర్, అర్బన్ పోలీసుస్టేషన్ రోడ్డు, రిజిస్టర్ ఆఫీస్ రోడ్డు, రెడ్ల బజారు,చౌత్ర సెంటర్,నెహ్రు నగర్ ప్రాంతములలో ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించవలసినదిగా కోరుచున్నాము… . ఆర్.అశోక్ కుమార్, డీ ఈ ఈ, విద్యుత్ శాఖ, చిలకలూరిపేట .
ఈ నెల 29 న ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుట్టినరోజు వేడుకలు వేడుకలు కు సిద్దమవుతున్న ప్రత్తిపాటి గార్డెన్స్ జన్మదినం సందర్భంగా మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నా అర్బన్ మున్సిపల్ కమిషనర్ శ్రీహరి పెదకాకాని శంకర కంటి వైద్యశాల సహకారంతో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తున్న ప్రత్తిపాటి కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా పేద ప్రజల కు మెడికల్ క్యాంప్ ద్వారా అందిస్తున్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి పేద వారికి ఒక వరం లా ఈ మెగా కంటి వైద్య శిబిరాలు… ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న క్యాంపు లు-కమిషనర్ శ్రీహరి
మహా ధర్నా లో పాల్గొన్న పొగాకు రైతులు రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ బర్లీ పొగాకు ను కంపెనీలు వెంటనే కొనుగోలు చేయాలన్నా పొగాకు రైతులు చిలకలూరిపేట NRT సెంటర్ ITC కంపెనీ ఎదుట ఉదయం 10గంటలనుంచిమహా ధర్నా లో పొగాకు రైతులు గుంటూరు, ప్రకాశం,, బాపట్ల ,పల్నాడు, ఉమ్మడి కర్నూలు జిల్లా ల పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి ధర్నాకు తరలివచ్చిన రైతు సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రైతుల వద్ద నుంచి పొగాకు కొనాలి-రైతులు పొగాకు బోర్డు పరిధిలో కి బర్లీ పొగను ను చేర్చాలి-రైతులు ఈ డిమాండ్ లతో రైతులు ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నా లో రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు
వైద్యశాలలో కాన్పుల సంఖ్య పెంచాలి : డీఎంహెచ్వో రవి నాదెండ్ల: ప్రభుత్వ వైద్యశాలలో బయటి రోగుల (ఓపీ) సేవలతో పాటు ప్రసూతి కాన్పుల సంఖ్య గణనీయంగా పెంచాలని వైద్య ఆరోగ్యశాఖ జిల్లా అధికారి రవి ఆదేశించారు. నాదెండ్ల మాతా శిశు ఆరోగ్య (పీహెచ్సీ) కేంద్రాన్ని డీ.ఎం.హెచ్.వో మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వార్డులు, రక్త పరీక్షల కేంద్రం, శస్త్రచికిత్సల గది, ఔషద దకాణాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులుకు అందించాల్సిన సేవలపై పలు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో వైద్య అధికారి డాక్టర్ శ్వేత, డాక్టర్ జ్ఞానేశ్వరి ఎంపీహెచ్ఎస్ దిలీప్ కుమార్, యూడీసీ హనుమా నాయక్ తదితరులు పాల్గొన్నారు.









